Site icon HashtagU Telugu

MS Dhoni: ధోనికి అరుదైన గౌరవం.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Ms Dhoni

Ms Dhoni

MS Dhoni: 2011 ప్రపంచ కప్ లో ధోనీ కొట్టిన చివరి సిక్స్ ను ఏ భారతీయుడు మరిచిపోలేడు. 2011 ఏప్రిల్ 2 రాత్రి ముంబయిలోని వాంఖడే వేదికగా శ్రీలంక, భారత్ వరల్డ్ కప్ ఫైనల్ లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తూ విశ్వవిజేతగా నిలిచింది. చివరిలో కులశేఖర బౌలింగ్​లో ధోని హెలికాఫ్టర్ షాట్ బాది మూడు దశాబ్దాల చిరకాల కోరికను తీర్చాడు. దాంతో భారత్ రెండో సారి ప్రపంచ కప్ ముద్దాడింది. ధోని కొట్టిన చివరి సిక్స్ ఇప్పటికీ కళ్ళముందే మెదులుతుంది. బాల్ తిన్నగా వెళ్లి ఎంసియే పెవీలియన్ లోని ఎల్ బ్లాక్ లోని సీట్ నెం.210లో పడింది. కాగా.. 2023 ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు ఇంగ్లండ్-సౌతాఫ్రికా జట్లు వాంఖడే వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ధోనికి మరియు 2011 ప్రపంచ కప్ లో ఆడిన ఆటగాళ్లకు అరుదైన గౌరవం దక్కింది. 2011 లో ధోని కొట్టిన సిక్స్ ల్యాండ్ అయిన సీట్ల దగ్గర 2011 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ ఫొటోను పెట్టి స్పెషల్​గా డిజైన్ చేశారు. క్రికెట్​లో ఇలా ఒక బాల్ పడ్డ చోట సీట్లను ప్రత్యేకంగా గౌరవిస్తూ, స్పెషల్ జోన్​గా రిజర్వ్​డ్​గా ఉంచడం బహుశా ఇదే ఫస్ట్ టైమ్. ఇది ధోనీకి దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నారు.

Also Read: Jagtial: బస్ కండక్టర్ నిజాయితీ.. 8 లక్షలు విలువ చేసే బాగ్

Exit mobile version