క్రికెట్‌లో ప్రస్తుతం టీ20ల హవా నడుస్తోంది. బ్యాటర్లు క్రీజులోకి వచ్చీరాగానే ఫోర్లు, సిక్సర్లు కొడుతూ అభిమానులను అలరిస్తున్నారు. ఫ్యాన్స్ కూడా బ్యాటర్ల నుంచి ఇవే కోరుకుంటున్నారు. అయితే.. ఈ టీ20 జమానాలో ఓ స్టేడియంలో మాత్రం సిక్స్‌ల(Sixes)ను నిషేదించారు. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిక్స్‌లను ఎందుకు నిషేదించారు. పొరబాటున అక్కడ ఎవరైనా బ్యాటర్ సిక్స్ కొడితే ఫలితం ఏంటి అన్న ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.
ఇంగ్లాండ్‌లోని పురాతన క్లబ్‌లలో బైటన్ సమీపంలో ఉన్న సౌత్‌విక్ మరియు షోర్‌హామ్ క్రికెట్ క్లబ్ ఒకటి. 1790లో దీన్ని ఏర్పాటు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ క్లబ్ ఆధ్వర్యంలోని మైదానంలో ఎంతో మంది క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. అయితే.. తాజాగా ఈ క్లబ్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ మైదానంలో సిక్స్‌లను నిషేదించింది. పొరబాటున ఎవరైనా ఆటగాడు మొదటి సారి సిక్స్ కొడితే.. ఆ పరుగులను పరిగణలోకి తీసుకోరు. రెండో సారి సిక్స్ కొడితే మాత్రం సదరు బ్యాటర్‌ను అంపైర్ ఔట్‌గా ప్రకటిస్తారని చెప్పింది.
ఎందుకు సిక్స్‌లను నిషేదించారంటే..?
ఆ స్టేడియం సమీపంలో నివసించే వారి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా క్లబ్ కోశాధికారి మార్క్ బ్రోకప్స్ చెప్పారు. ఒకప్పుడు క్రికెట్ ఆట ఎంతో ప్రశాంతంగా ఉండేదన్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్, టీ20ల రాకతో ఆటలో వేగం పెరగడంతో పాటు బ్యాటర్లు అవలీలగా సిక్స్‌లు కొడుతున్నారని చెప్పాడు. దీని వల్ల క్లబ్ సమీపంలో నివసించే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే ఈ గ్రౌండ్‌లో సిక్స్‌లను నిషేదించినట్లు తెలిపారు.
Also read :Women’s Asia Cup 2024: ఆసియా కప్‌లో తొలి సెంచరీ, మిథాలీ రికార్డు బద్దలు
వాస్తవానికి ఈ మైదానం చాలా చిన్నదిగా ఉంది. దీంతో మైదానంలోని బ్యాటర్లు సిక్సర్లు కొట్టినప్పుడు ఆ బంతులు సమీపంలోకి ఇళ్ల కిటీకీలను, కార్లును బద్దలు కొట్టేవి. కొన్ని సార్లు వ్యక్తులను తగడంతో వారు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. దీంతో స్థానిక ప్రజలు తమను పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరుగుతోందని, చర్యలు తీసుకోవాలని ఎన్నో ఏళ్లుగా కబ్ల్‌ను కోరుతున్నారు. ఈ సమస్యలపై చర్చింన క్లబ్ ఇటీవల సిక్స్‌లను నిషేదించింది. దీని వల్ల స్థానికులకు ఇబ్బందులు తప్పుతాయని భావిస్తోంది.