Site icon HashtagU Telugu

IOC apologizes: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకుల భారీ తప్పిదం, దక్షిణ కొరియా ఫైర్

Ioc Apologizes

Ioc Apologizes

IOC apologizes: పారిస్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవంలో పలువురు ప్రపంచ నాయకులు పాల్గొన్నారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రసిద్ధ కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. అయితే ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకులు చేసిన తప్పిదం కారణంగా దక్షిణకొరియా దేశం ఆగ్రహానికి గురైంది.

ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ప్రపంచంలోని అన్ని దేశాల నుండి జట్లను పరిచయం చేస్తున్నప్పుడు, నిర్వాహకులు దక్షిణ కొరియా జట్టును ఉత్తర కొరియా జట్టుగా తప్పుగా పిలిచారు.దీంతో దక్షిణ కొరియా జట్టు ఆగ్రహానికి గురైంది. అయితే తమ తప్పును అంగీకరించిన ఒలింపిక్స్ నిర్వాహకులు ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగబోమని భరోసా ఇచ్చారు.

ఉత్తర కొరియా నుంచి 143 మంది క్రీడాకారులు పాల్గొన్నారు:
దక్షిణ కొరియా ఆటగాళ్లు 21 రకాల క్రీడల్లో పాల్గొనబోతున్నారు. దక్షిణ కొరియా నుంచి 143 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. దక్షిణ కొరియా క్రీడలు మరియు సంస్కృతి వైస్ మినిస్టర్, జాంగ్ మి-రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్‌తో ఈ విషయాన్ని చర్చించినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

భారత్ పతకాలపై ఆశలు:
పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు భారత్ 117 మంది ఆటగాళ్లతో కూడిన బృందాన్ని పంపింది. అథ్లెటిక్స్ (29), షూటింగ్ (21) మరియు హాకీ (19) నుండి సగం మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈ 69 మంది ఆటగాళ్లలో 40 మంది క్రీడాకారులు తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారతదేశం ఒక బంగారు పతకంతో సహా మొత్తం 7 పతకాలను గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఈసారి మరిన్ని పతకాలపై ఆశలు పెట్టుకుంది.

Also Read: Whatsapp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. మేటా ఏఐ లో మరో సరికొత్త ఫీచర్?