South Africa vs England: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో దక్షిణాఫ్రికా సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. దీంతో సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న అఫ్గానిస్థాన్ ఆశలు గల్లంతయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ రేసులో ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే దూరమైంది.
ఆఫ్రికా సెమీఫైనల్‌కు ఎలా చేరింది?
దక్షిణాఫ్రికా ఇంగ్లండ్‌ను (South Africa vs England) 38.2 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌ను నాకౌట్ రేసులో నిలబెట్టాలంటే గెలుపు మార్జిన్ కనీసం 207 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లండ్ జట్టు 200 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయింది. రూట్ 37 పరుగులతో ఇంగ్లీష్ జట్టులో అత్యధిక పరుగులు చేశాడు. జోఫ్రా ఆర్చర్ (25), బెన్ డకెట్ (24), జోస్ బట్లర్ (21) కూడా రాణించారు. మార్కో జెన్సన్, వియాన్ ముల్డర్ చెరో మూడు వికెట్లు తీయగా, కేశవ్ మహరాజ్ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. కగిసో రబాడ, లుంగీ ఎన్‌గిడి ఒక్కో వికెట్ తీశారు.
Also Read: Anil Ravipudi : అనిల్ సినిమాలే కాదు లవ్ స్టోరీ కూడా ఫన్నీ గా ఉందే..!
పాకిస్థాన్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో, టైటిల్ పోటీలో ఉన్న ఇంగ్లండ్ ఘోర అవమానంతో తమ దేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. కరాచీ వేదికగా శనివారం జరిగిన గ్రూప్-బి చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్‌కు చేరుకోగా, టోర్నీలో ఇంగ్లండ్ ప్రయాణం ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ముగిసింది. దక్షిణాఫ్రికా బౌలర్లు అద్భుత ప్రదర్శనతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను కేవలం 179 పరుగులకే ఆలౌట్ చేశారు. మార్కో జెన్సన్, వియాన్ ముల్డర్ చెరో 3 వికెట్లు తీశారు. దీంతో నెట్ రన్ రేట్ ఆధారంగా దక్షిణాఫ్రికా సెమీఫైనల్ టికెట్ ఖాయమైంది.
నెట్ రన్ రేట్ ఆధారంగా దక్షిణాఫ్రికా సెమీ-ఫైనల్ టిక్కెట్ ఖరారైంది. అయితే R వాన్ డెర్ డుస్సెన్ 87 బంతుల్లో 72 నాటౌట్ కాగా హెన్రీ క్లాసెన్ 56 బంతుల్లో 64 పరుగులు చేసి విజయంతో తమ జట్టుకు చివరి ఫోర్‌కి టిక్కెట్‌ను ఖాయం చేశారు. దక్షిణాఫ్రికా 3 వికెట్లకు 181 పరుగులు చేసి 125 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. వీరిద్దరి మధ్య 127 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో దక్షిణాఫ్రికా 29.1 ఓవర్లలో 3 వికెట్లకు 181 పరుగులు చేసి విజయం సాధించింది.