Team India Squad: భారతదేశ పర్యటనకు రానున్న దక్షిణాఫ్రికా జట్టుతో ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత టీమ్ ఇండియా తలపడనుంది. నవంబర్ 14 నుండి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 4 వరకు ఈ సిరీస్‌కు జట్టును ఇంకా ప్రకటించలేదు. దీంతో బీసీసీఐ టెస్ట్ జట్టును ఎప్పుడు ప్రకటిస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెస్టిండీస్‌తో ఆడిన టెస్ట్ జట్టులో ఎలాంటి మార్పులు ఉంటాయనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది.
త్వరలోనే జట్టు ప్రకటన
ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26లో అన్ని జట్లు తమ మూడో మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ ఈ రోజు ముగిశాయి. నివేదికల ప్రకారం.. బీసీసీఐ సెలక్టర్లు ఈ మ్యాచ్‌ల ముగింపు కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి రాబోయే 72 గంటల్లో టెస్ట్ సిరీస్‌కు టీమ్ ఇండియాను ప్రకటించే అవకాశం ఉంది. ఇక వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. కాబట్టి వన్డే, టీ20 సిరీస్‌లకు జట్టును నవంబర్ మూడో వారంలో ప్రకటించవచ్చు. భారత జట్టు ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. అక్కడ ఆయన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో చర్చించి జట్టుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read: Bilaspur Train Accident: బిలాస్‌పూర్ స్టేషన్ సమీపంలో రెండు రెళ్లు ఢీ!
టీమ్ ఇండియాలో రెండు మార్పులు ఉండవచ్చు. వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్.. ఎన్. జగదీశన్ స్థానంలో తిరిగి జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ కూడా ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో జట్టులో స్థానం దక్కించుకోవచ్చు. షమీ నిలకడగా మంచి ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.
భారతదేశపు జట్టు ఇదే (అంచనా)
- శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.
సిరీస్ షెడ్యూల్
- మొదటి టెస్ట్: నవంబర్ 14 నుండి 18 వరకు – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
- రెండవ టెస్ట్: నవంబర్ 22 నుండి 26 వరకు – బర్సపారా క్రికెట్ స్టేడియం, గువాహటి
