SA vs Ind: భారత్‌తో సీరీస్ కు సఫారీ టీమ్ ఇదే

ఐపీఎల్‌ 15వ సీజన్ ముగిసిన వెంట‌నే టీమిండియా సొంతగడ్డపై ద‌క్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల ఆడ‌నుంది.

  • Written By:
  • Publish Date - May 17, 2022 / 04:03 PM IST

ఐపీఎల్‌ 15వ సీజన్ ముగిసిన వెంట‌నే టీమిండియా సొంతగడ్డపై ద‌క్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల ఆడ‌నుంది. ఈ సిరీస్ జాన్ 9న ప్రారంభం కానుండగా జూన్ 19న ముగియ‌నుంది. ఈ టీ20 సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు 16 మంది ఆటగాళ్లతో కూడిన తమ జట్టును తాజాగా ప్రకటించింది. ఈ జట్టుకు టెంబ బావుమా సారథిగా వ్యవహరించనున్నాడు. ఇక యువ సంచలనం ట్రిస్టన్ స్టబ్స్ టీ20ల్లో అరంగేట్రం చేయునున్నాడు. అలాగే గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరమైన సీనియర్ పేసర్ అన్రీచ్‌ నోర్జే కూడా తిరిగి జట్టులోకి అడుగుపెట్టాడు.

ఇక భారత పర్యటనకు ఎంపికైన ప్రోటిస్‌ జట్టుకు టెంబా బావుమా కెప్టెన్‌ గా ఉండగా, ఆ జట్టులో క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్ చోటు దక్కించుకున్నారు. అయితే ఈ జట్టులో ఐపీఎల్ 2022లో ఆడుతున్న ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఐపీఎల్‌లో ఆడుతున్న కారణంగా భారత పిచ్‌లు, అక్కడి వాతావరణ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంటుందనే కారణంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఎక్కువగా ఐపీఎల్ ఆటగాళ్లకు ప్రాధాన్యమిచ్చింది…

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా… జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ మొదలవ్వనుంది. తొలి టీ 20 మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరగనుండగా.. రెండో టీ 20 మ్యాచ్ 12వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా మూడో టీ20 14న మహారాష్ట్రలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. 17వ తేదీన నాలుగో మ్యాచ్ గుజరాత్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా , 19న చివరి టీ20 ఢిల్లీ వేదికగా జరగనుంది.