Site icon HashtagU Telugu

Team India : భార‌త్ ఓట‌మి – సొంత‌గ‌డ్డ‌పై ద‌క్షిణాఫ్రికా విజ‌యం

South Africa cricket team

South Africa cricket team

దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ విజయం టీమిండియాకి కలగానే మిగిలిపోయింది. మూడు దశాబ్దాలుగా అక్కడ టెస్టు సిరీస్ గెలుపు కోసం నిరీక్షిస్తున్న భారత్ జట్టు.. ఈరోజు సిరీస్ విజేత నిర్ణయాత్మక చివరి టెస్టులోనూ 7 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఈ మూడో టెస్టులో గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు 2-1తో సిరీస్‌ని దక్కించుకోగా.. కేప్‌టౌన్‌లో ఇప్పటి వరకూ టెస్టు మ్యాచ్‌లో గెలవని జట్టుగా టీమిండిచా చెత్త రికార్డ్‌ని కొనసాగించింది.
సొంత‌గ‌డ్డ అధిక్య‌త‌ని నిరూపించుకుంటూ ద‌క్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో భార‌త్ పై విజ‌యాన్ని సాధించింది. దాంతో మూడు టెస్టుల సిరీస్ ను 2-1తో చేజిక్కించుకుంది. 212 పరుగుల విజయలక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాస్సీ వాన్ డర్ డుస్సెన్ 41, టెంబా బవుమా 32 పరుగులతో తమ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. అంతకుముందు, యువ ఆటగాడు కీగాన్ పీటర్సన్ 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడడం ఆటలో హైలైట్. పీటర్సన్ స్లిప్స్ లో ఇచ్చిన క్యాచ్ ను పుజారా జారవిడవడం ప్రతికూలంగా మారింది. ఈ సిరీస్ లో తొలి టెస్టును టీమిండియా నెగ్గిన తీరు చూస్తే, మిగతా టెస్టుల్లోనూ ఎదురుండదనిపించింది.
డిసెంబరు చివరి వారంలో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 113 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. గత వారం జొహనెస్‌బర్గ్‌లో ముగిసిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా కేప్‌టౌన్ టెస్టులో 7 వికెట్ల తేడాతో ఓడటం ద్వారా సిరీస్‌ని చేజార్చుకుంది.
దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటి వరకూ తొమ్మిది సార్లు పర్యటించిన భారత్ జట్టు..
కనీసం ఒక్కసారి కూడా అక్కడ టెస్టు సిరీస్‌ని గెలవలేకపోయింది. 2011లో డ్రా చేసుకోవడం ఒక్కటే ఇప్పటి వరకూ భారత్ తరఫున అక్కడ అత్యుత్తమ ప్రదర్శన. ఇక కేప్‌టౌన్‌లో 1992లో తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడిన భారత్ జట్టు..

 https://twitter.com/BCCI/status/1481958367799422983

 

Exit mobile version