South Africa T20: ఐపీఎల్ తరహాలో మ‌రో టోర్నీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్నా ఐపీఎల్ మెగా టోర్నీ మాదిరిగా మ‌రో టీ20 లీగ్ ను ప్రారంభించనున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడిందింది.

  • Written By:
  • Updated On - May 2, 2022 / 04:38 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్నా ఐపీఎల్ మెగా టోర్నీ మాదిరిగా మ‌రో టీ20 లీగ్ ను ప్రారంభించనున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడిందింది. ఆరు జట్లు పోటీపడనున్న ఈ టీ20 లీగ్‌ను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొననుండగా ప్రతి టీం ఒక్కో టీంతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతాయి. లీగ్ దశ మ్యాచ్‌ల్లో పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్ కు అర్హత సాధిస్తాయి.

ప్లేఆఫ్ దశలో ఈ మూడు జట్లు మళ్లీ ప్రతి జట్టుతో ఒక మ్యాచ్ లో తలపడుతాయి. ఈ మూడు జట్లలో టాప్ లో నిలిచిన ఉన్న రెండు జట్లు ఫైనల్ కు చేరుకుంటాయి. ఆఖరికి ఏఈ ఫైనల్లో గెలిచిన జట్టు టోర్నీ విజేతగా నిలుస్తుంది. ఇక నెల రోజుల జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 33మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్ మాదిరిగానే ఈ టోర్నీలోనూ ప్రతి జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లు ఉంటారు. అలాగే ఆటగాళ్లను కూడా ఐపీఎల్ తరహాలోనే వేలం నిర్వహించి కొనుగోలు చేయనున్నారు. ఈ టోర్నీ విజ‌య‌వంత‌మైతే ఆ తరువాత మహిళల టీ20 టోర్నీ కూడా నిర్వహిస్తామని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ విజయవంతమవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాకపోతే ఐపీఎల్ అంత గ్రాండ్ సక్సెస్ మాత్రం అవడం కష్టమే అంటున్నారు.