Site icon HashtagU Telugu

South Africa Squad: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు సౌతాఫ్రికా జ‌ట్టు ఇదే.. స‌త్తా ఉన్న ఆట‌గాళ్లే ఉన్నారుగా..!

South Africa Squad

Safeimagekit Resized Img (4) 11zon

South Africa Squad: టీ20 ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా జట్టు (South Africa Squad)ను ప్రకటించింది. ఐడెన్ మార్క్రామ్‌ను జ‌ట్టు కెప్టెన్‌గా చేసింది. మార్క్రామ్ IPL 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. 15 మంది సభ్యుల జట్టుతో పాటు, సౌతాఫ్రికా ట్రావెలింగ్ రిజర్వ్‌లో ముగ్గురు ఆటగాళ్లను కూడా చేర్చుకుంది. IPL 2024లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఆఫ్రికన్ ఆట‌గాళ్లు చాలామంది జట్టులో చేర్చబడ్డారు. ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీకి కూడా జట్టులో అవకాశం లభించింది. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కోయెట్జీ ద‌క్షిణాఫ్రికా జ‌ట్టులో భాగ‌మయ్యాడు. ఈ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు.

సౌతాఫ్రికా జట్టు సమతూకంగా కనిపిస్తోంది

T20 ప్రపంచ కప్ కోసం సౌతాఫ్రికా ఎంపిక చేసిన జట్టు చాలా సమతుల్యంగా ఉంద‌ని క్రీడా పండితులు చెబుతున్నారు. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన యువ ఆటగాళ్లకు కూడా ఛాన్స్ ఇవ్వ‌టంతో జ‌ట్టు స‌మ‌తూకంగా కనిపిస్తోంది. జట్టులో కెప్టెన్ ఐడాన్ మార్కర్, క్వింటన్ డి కాక్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు.

Also Read: LSG vs MI: నేడు ల‌క్నో వ‌ర్సెస్ ముంబై.. రోహిత్‌కు బ‌ర్త్‌డే కానుక‌గా MI విజ‌యం సాధిస్తుందా..?

జూన్ 3న తొలి మ్యాచ్

T20 ప్రపంచ కప్ 2024 జూన్ 1 నుండి ప్రారంభమవుతుంద‌ని మ‌న‌కు తెలిసిందే. అయితే జూన్ 3, సోమవారం నుండి టోర్నమెంట్‌లో సౌతాఫ్రికా జ‌ట్టు తన ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. ద‌క్షిణాఫ్రికా తొలి మ్యాచ్ శ్రీలంకతో జరగనుంది .సౌతాఫ్రికా జ‌ట్టు గ్రూప్ డిలో ఉంది.

We’re now on WhatsApp : Click to Join

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు దక్షిణాఫ్రికా జట్టు

దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మార్క్‌రామ్ (సి), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్.

ట్రావెలింగ్ రిజర్వ్- నాంద్రే బర్గర్, లుంగి ఎన్గిడి.