Site icon HashtagU Telugu

Saurav Ganguly: గంగూలీ రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయమా..? ఈ ట్వీటే సాక్ష్యమా..?

Sourav Ganguly

Saurav Ganguly

టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి ప్రవేశించడం ఖాయమేనన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే బీసీసీఐ చీఫ్ పదవికి రాజీనామా చేయనున్న గంగూలీ…ఆ వెంటనే బీజేపీలో చేరతారంటూ పుకార్లు జోరుగా సాగుతున్నాయి. ఈ వార్తలు నిజమేనన్న కోణంలో బుధవారం సాయంత్రం తన ట్విట్టర్ అకౌంట్లో గంగూలీ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.

క్రికెట్లోకి అడుగుపెట్టి 30ఏళ్ల అయ్యిందంటూ..ఈ సుదీర్ఘ కెరీర్ లో తనకు మద్దతుగా నిలిచిన వారికి గంగూలీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అంతేకాదు మరింత మంది ప్రజలకు సేవ చేసే దిశగా త్వరలోనే ఓ కొత్త నిర్ణయం తీసుకోబోతున్నానని కూడా పేర్కొన్నారు. కాగా బీసీసీఐ కార్యదర్శి జైషాతో ఈ మధ్యకాలంలో మరింత సన్నిహితంగా మెలగుతున్న గంగూలీ…నెల వ్యవధిలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో రెండు పర్యాయాలు కలిసారు. గత నెల 7న కోల్ కతా వెళ్లిన అమిత్ షా…గంగూలీ ఇంటికి వెళ్లారు. ఈ సందర్బంగా గంగూలీ ఇంట్లోనే అమిత్ షా భోజనం కూడా చేశారు.

ఆ తర్వాత ఈమధ్య మరోమారు అమిత్ షాను గంగూలీ కలిశారని సమాచారం. ఇలా అమిత్ షాతో రెండు సార్లు సమావేశం కావడం….తాజాగా మంది మంది ప్రజలకు సేవచేసే దిశగా కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్నాని స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో గంగూలీ రాజకీయ రంగ ప్రవేశం ఖాయమేనన్న వాదణలు బలంగా వినిపిస్తున్నాయి.

Exit mobile version