Sourav Ganguly: భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుర్ద్వాన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయన కాన్వాయ్‌లోని కారును వెనుక నుంచి ఆయన మరో కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడం విశేషం.
భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ప్రయాణిస్తున్న కారు గురువారం దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. సౌరవ్ గంగూలీ ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు బుర్ద్వాన్‌కు వెళుతుండగా దంతన్‌పూర్ సమీపంలో ఆయన కారును ట్రక్కు ఢీకొట్టింది. అకస్మాత్తుగా ట్రక్కు డ్రైవర్ బ్రేకులు వేశాడు. సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
Also Read: Birth Certificate: మీకు బర్త్ సర్టిఫికేట్ కావాలా? తుది గడువు ఇదే!
రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి
ఈ ప్రమాదంలో సౌరవ్ గంగూలీతో పాటు అతని కారులో ఎవరికీ గాయాలు కాకపోవడం ఉపశమనం కలిగించే విషయం. గంగూలీ కాన్వాయ్‌లోని రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వార్తలు వచ్చాయి. ప్రమాదంతో భయాందోళనకు గురైన వారంతా వాహనాల్లోంచి బయటకు వచ్చి బయట నిలబడ్డారు. సౌరవ్ గంగూలీ కూడా దాదాపు 10 నిమిషాల పాటు రోడ్డుపై నిలబడ్డాడు. పరిస్థితి సాధారణం కావడంతో గంగూలీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
గంగూలీ రోడ్డుపై నిలబడ్డాడు
అనంతరం బుర్ద్వాన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సౌరవ్ గంగూలీ పాల్గొన్నారు. సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) మాజీ అధ్యక్షుడు అని మనకు తెలిసిందే. సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ జట్టుకు అత్యుత్తమ, తెలివైన కెప్టెన్‌గా పేరు పొందాడు. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు ఎన్నో రికార్డులను నెలకొల్పింది. అతని సమయంలో జట్టు విదేశాల్లో కూడా బాగా రాణించింది.