Saurav Ganguly:మళ్లీ బ్యాట్ పట్టనున్న దాదా

భారత క్రికెట్ జట్టు  మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మళ్ళీ బ్యాట్ పట్టనున్నాడు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఛారిటీ మ్యాచ్‌లో దాదా ఆడనున్నాడు.

  • Written By:
  • Publish Date - July 30, 2022 / 03:39 PM IST

భారత క్రికెట్ జట్టు  మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మళ్ళీ బ్యాట్ పట్టనున్నాడు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఛారిటీ మ్యాచ్‌లో దాదా ఆడనున్నాడు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట క్యాంపెయిన్‌ నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఒక చారిటీ ఫండ్‌ రైజింగ్‌ మ్యాచ్‌​ నిర్వహించాలంటూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం బీసీసీఐని సంప్రదించింది. కేంద్ర ప్రతిపాదనను ఒప్పుకున్న బీసీసీఐ ఆగస్టు 22న భారత్‌ ఎలెవెన్‌, రెస్ట్‌ ఆఫ్‌ వరల్డ్‌ ఎలెవెన్‌ మధ్య మ్యాచ్‌ నిర్వహించేందుకు సమాయాత్తమవుతుంది. ఈ మ్యాచ్‌లో పలువురు మాజీ క్రికెటర్లు, విదేశీ స్టార్ ప్లేయర్స్ బరిలోకి దిగనున్నారు. అయితే
బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్‌ గంగూలీ మొదట చారిటీ మ్యాచ్‌లో పాల్గొనడం లేదని ప్రకటించాడు.

బీసీసీఐ కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్‌ కారణంగానే దూరంగా ఉండనున్నట్లు చెప్పాడు. అయితే తాజాగా దాదా తన మనసు మార్చుకున్నాడు. బీసీసీఐ నిర్వహించనున్న చారిటీ మ్యాచ్‌లో ఆడనున్నట్లు ప్రకటించాడు. తాజాగా జిమ్‌ సెషన్‌లో పాల్గొన్న గంగూలీ దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. చారిటీ మ్యాచ్‌లో ఆడనున్నా. కసరత్తులు ఆరంభించా.. ఇక బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ మొదలెట్టాలి. అలాగే లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్లోనూ ఆడబోతున్నా’ అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. కాగా ఆగస్టు 22న జరగనున్న ఈ మ్యాచ్‌కు ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. భారత్‌ ఎలెవెన్‌ పెద్ద సమస్య కాకపోయినా.. రెస్ట్‌ ఆఫ్‌ వరల్డ్‌ ఎలెవెన్‌ జాబితా ఎంపిక చేయడం కష్టంగానే కనిపిస్తోంది. మే. మొత్తం 13-14 మంది ఆటగాళ్లను జట్టుకు ఎంపిక చేయనున్నారు. బీసీసీఐ నిర్వహించనున్న చారిటీ మ్యాచ్‌ ఆడనున్న గంగూలీ.. లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ లీగ్‌లో ఆడేందుకు
కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. కరోనా తర్వాత రెండుసార్లు ప్రేక్షకులు లేకుండానే జరిగిన ఈ లీగ్‌కు ఇప్పుడు అభిమానులను అనుమతించనున్నారు.