World Cup 2023: టైటిల్ రేసులో భారత్ తో పాటు మరో నాలుగు జట్లు

వన్డే ప్రపంచ మహాసంగ్రామానికి సమయం దగ్గరపడుతుందో. ఈ సారి టీమిండియా ప్రపంచ కప్ కు ఆతిధ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 5 నుంచి 2023 వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.

Published By: HashtagU Telugu Desk
World Cup 2023

New Web Story Copy (38)

World Cup 2023: వన్డే ప్రపంచ మహాసంగ్రామానికి సమయం దగ్గరపడుతుందో. ఈ సారి టీమిండియా ప్రపంచ కప్ కు ఆతిధ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 5 నుంచి 2023 వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరుగుతుంది. ఇందుకు సంబంధించి అన్ని జట్లు సన్నాహాలు ప్రారంభించాయి.

అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ లోనే భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. ఈ సమయంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆసక్తికరంగా మారింది. టైటిల్ రేసులో భారత్ ఉన్నప్పటికీ ప్రపంచ కప్ టైటిల్ రేసులో మరో నాలుగు జట్లు కూడా ఉన్నాయని గంగూలీ అభిప్రాయపడ్డాడు

ప్రపంచకప్‌కు పోటీలో భారత్ ఎప్పుడూ ఉంటుంది. దీంతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌లు ఈసారి పోటీలో ఉన్నాయి. న్యూజిలాండ్ పెద్ద టోర్నీల్లో బాగా ఆడుతుందని గంగూలీ చెప్పడం ఆసక్తిదాయకం. కాగా టీమిండియా నాలుగో స్థానం విషయంలో ఇబ్బంది పడుతుందని, అయితే ఆ స్థానాన్ని తిలక్ వర్మ అయితేనే న్యాయం చేయగలడని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Also Read: Tirumala Tiger : అదిగో చిరుత‌..ఇదిగో క‌ర్ర‌.! TTDపై నెటిజ‌న్ల ట్రోల్స్, మీమ్స్ హోరు!!

  Last Updated: 19 Aug 2023, 04:39 PM IST