Sourav Ganguly: క్లారిటీ ఇచ్చిన గంగూలీ.. ఎవరూ శాశ్వత అధ్యక్షునిగా ఉండిపోలేరు..!

బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఓ క్లారిటీ ఇచ్చారు. బీసీసీఐ అధ్య‌క్షుడిగా కొన‌సాగాల‌ని ఉన్నా.. గంగూలీని త‌ప్పిస్తున్న‌ట్లు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - October 13, 2022 / 05:23 PM IST

బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఓ క్లారిటీ ఇచ్చారు. బీసీసీఐ అధ్య‌క్షుడిగా కొన‌సాగాల‌ని ఉన్నా.. గంగూలీని త‌ప్పిస్తున్న‌ట్లు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో గంగూలీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్న గంగూలీ మాట్లాడుతూ.. చాలా సంవత్స‌రాల‌ నుంచి ప‌రిపాల‌కుడి పాత్ర‌ను పోషించాను. ఇప్పుడు మ‌రో పాత్ర‌ను పోషించాల‌ని చూస్తున్న‌ట్లు తెలిపారు.

చాలా సంవ‌త్స‌రాలు అడ్మినిస్ట్రేట‌ర్‌గా ఉన్నాన‌ని, ఇప్పుడు మ‌రో ఉన్న‌త స్థానానికి వెళ్లాలని ఆశిస్తున్న‌ట్లు గంగూలీ అభిప్రాయ‌ప‌డ్డారు. జీవితంలో ఏదీ చేసినా. ఉత్త‌మ రోజులు మాత్రం ఇండియాకు ఆడిన రోజులే అని స్ప‌ష్టం చేశారు. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా చేశాన‌ని, భ‌విష్య‌త్‌తో మ‌రిన్ని మంచి ప‌నులు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. ఎప్ప‌టికీ ప్లేయ‌ర్‌గా ఉండ‌లేమ‌ని, అలాగే ఎప్ప‌టికీ ప‌రిపాల‌కుడిగా ఉండ‌లేమ‌ని ఆయ‌న అన్నారు. ఆ రెండు చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

ఒక్క‌రోజులోనే అంబానీనో లేక‌ మోదీనో కాలేమ‌న్నారు. క్రికెట్ బోర్డు అధ్యక్షునిగా ఆయన తన పదవీ కాలాన్ని సంతోషంగా నిర్వహించానని పేర్కొన్నారు. దాదా.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఐదేళ్లు పని చేశారు. అంతేకాకుండా.. బీసీసీఐ అధ్యక్షునిగా కూడా పని చేశారు. బీసీసీఐ అధ్యక్షునిగా రోజర్ బిన్నీ బాధ్యతలు స్వీకరించనున్నారు.