Site icon HashtagU Telugu

AB de Villiers: విరాట్ కోహ్లీకి షాక్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్!

AB de Villiers

AB de Villiers

AB de Villiers: దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ (AB de Villiers) ఇటీవల టెస్ట్ క్రికెట్‌లో తన టాప్ 5 గొప్ప ఆటగాళ్ల జాబితాను వెల్లడించారు. ఈ జాబితాలో భారత స్టార్ బ్యాట‌ర్‌ విరాట్ కోహ్లీని చేర్చలేదు. కోహ్లీ ఏబీ జాబితాలో లేడు. అయినప్పటికీ ఏబీ ఈ జాబితాలో ఒక భారతీయ దిగ్గజాన్ని చేర్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెటర్‌ను కూడా ఏబీ తన జాబితాలో చేర్చారు. ఈ జాబితాలో ఒక దక్షిణాఫ్రికా దిగ్గజం కూడా ఉన్నారు.

ఆల్ రౌండర్లకే ప్రాధాన్యం

‘బియర్డ్ బిఫోర్ క్రికెట్’ అనే పోడ్‌కాస్ట్‌లో ఏబీ డివిలియర్స్ టెస్ట్ క్రికెట్‌లోని టాప్ 5 స్టార్ బ్యాట‌ర్ల‌ గురించి మాట్లాడారు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కల్లిస్, పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ ఆసిఫ్‌లను ఏబీ టాప్ 5లో చేర్చారు. ఇంగ్లండ్ స్టార్ బ్యాట‌ర్‌ గురించి ఏబీ మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌లో అతనిలాంటి గొప్ప ఫాస్ట్ బౌలర్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. నా దృష్టిలో ఆండ్రూ ఫ్లింటాఫ్ నంబర్ 2 స్థానంలో ఉంటాడు. ఫ్లింటాఫ్ నిజంగా ఒక మ్యాచ్ విన్నర్. ఎడ్జ్‌బాస్టన్‌లో కల్లిస్‌కు అతను వేసిన యార్కర్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ యార్కర్ చాలా అద్భుతమైనది! బహుశా నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ యార్కర్ అది’ అని అన్నారు.

Also Read: TGSRTC: తెలంగాణ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం.. డ్రైవ‌ర్లు ఫోన్ల వాడ‌కంపై నిషేధం!

ఆస్ట్రేలియా, భారత దిగ్గజాలకూ చోటు

స్పిన్నర్ షేన్ వార్న్, దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ల గురించి ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ.. ‘నాకు వారిద్దరిపై బ్యాటింగ్ చేయడం చాలా ఇష్టం. వార్నీ నేను చూసిన అత్యుత్తమ బౌలర్ అని నేను అనను. కానీ అతను ఒక ప్యాకేజీ. అతను నా వైపు చూసే విధానం, తన జుట్టును సరిచేసుకునే తీరు, అతని బంతి తిరిగే విధానం, నిజం చెప్పాలంటే అది ఒక కవితలా ఉంటుంది. కవి రాసే కవిత లాంటిది. సచిన్ బ్యాటింగ్ చేయడానికి వెళ్లే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వావ్, అతను చాలా గొప్పవాడు. సచిన్ గొప్ప క్రికెటర్, నేను విరాట్ కోహ్లీని ఎలా మర్చిపోగలను’ అని అన్నారు.