ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women’s Premier League) ప్లేయర్ వేలం సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సోమవారం అత్యంత ఖరీదైన కొనుగోలుదారుగా నిలిచింది. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో మంధానను 3.4 కోట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. అంతేకాకుండా, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీని 1.7 కోట్లకు కొనుగోలు చేసింది RCB. WPL ప్రారంభ ఎడిషన్‌కు వేలం ఒక ల్యాండ్‌మార్క్ ఈవెంట్‌గా మారడంతో కొంతమంది అభిమానులు వాటి నుండి మీమ్‌లను రూపొందించారు.
అభిమానులు స్మృతి మంధాన, ఎల్లీస్ పెర్రీలను చాలా ఎక్కువ వేలం వేసినందుకు అభినందించడానికి ట్విట్టర్‌లో ట్వీట్లు చేస్తున్నారు. అదే సమయంలో పాకిస్తాన్ కెప్టెన్‌ను ఎగతాళి చేస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)లో మంధాన కంటే తక్కువ జీతం అందుకున్నందుకుబాబర్ ఆజమ్ ను ఎగతాళి చేస్తున్నారు. ఓ అభిమాని ట్వీట్ చేస్తూ.. స్మృతి మంధాన WPL వేతనం ఇప్పుడు బాబర్ ఆజం PSL జీతం కంటే ఎక్కువ అని కామెంట్ చేశారు.
Babar Azam Price in PSL – 2.30 CR
SMRITI MANDHANA – 3.4 CrAnd they Compare PSL with IPL #WPLAuction #WPL2023 pic.twitter.com/GBWpeovL9n
— Verot Choli (@VerotCholi) February 13, 2023
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కెప్టెన్ బాబర్ ఆజమ్, పేసర్ షహీన్ అఫ్రిదీ వంటి స్టార్ ఆటగాళ్లు కంటే మంధాన ఎక్కువ మొత్తాన్ని అందుకోవడం విశేషం. పీఎస్‌ఎల్‌లో బాబర్ కు పాక్ కరెన్సీలో 3.60 కోట్లు అందుతుంది. బాబర్ ఈ ఏడాది సీజన్‌కు గాను రూ. 3.60 కోట్ల మొత్తాన్ని అందుకున్నాడు. బాబర్ అందుకునే మొత్తం రూ. 3 కోట్ల 60 లక్షలు. భారత కరెన్సీలో వచ్చేసరికి రూ. కోటి 23 లక్షలు మాత్రమే. అంటే పీఎస్‌ఎల్‌లో అత్యధిక మొత్తం అందుకుంటున్న బాబర్ కంటే స్మృతి మంధాన రెండున్నరెట్లు ఎక్కువ మొత్తాన్ని మహిళల ప్రీమియర్ లీగ్ ద్వారా అందుకోబోతోంది. దీంతో ఫ్యాన్స్ పాక్ క్రికెటర్లను ఓ ఆట ఆడుకుంటున్నారు.