Site icon HashtagU Telugu

Smriti Mandanna: భారత మహిళలదే రెండో టీ-ట్వంటీ

Smriti Mandanna

Smriti Mandanna

ఇంగ్లాండ్ టూర్ లో భారత మహిళల క్రికెట్ జట్టు బోణీ కొట్టింది. తొలి టీ-ట్వంటీలో ఓడిన భారత్.. రెండో మ్యాచ్ లో అదరగొట్టింది. 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ వుమెన్ టీమ్ ను భారత బౌలర్లు సమిష్టిగా కట్టడి చేశారు. ఒక దశలో 54 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. అయితే చివర్లో ఫ్రెయా కెంప్ హఫ్ సెంచరీతో ఆడుకుంది. ఆమెతో పాటు బౌచర్ రాణించడంతో ఇంగ్లాండ్ 142 రన్స్ చేయగలిగింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3 వికెట్లు, రేణుకా సింగ్, దీప్తి శర్మ చెరో తీశారు.
143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ లో స్మృతి మంథానా బ్యాటింగ్ హైలైట్. భారీ షాట్లతో ఇంగ్లాండ్ బౌలర్ల పై విరుచుకుపడింది. తొలి వికెట్ కి షేఫాలి వర్మతో కలిసి 55 పరుగులు జోడించింది. స్మృతి 53 బంతుల్లో 13 ఫోర్లతో 79 రన్స్ చేసింది. దీంతో భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేదించింది. ఈ విజయంతో మూడు టీ20 సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది. హాఫ్ సెంచరీ తో అదరగొట్టిన స్మృతి మంథానాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గౌరవం దక్కింది. సీరీస్ ను డిసైడ్ చేసే మూడో టీ-ట్వంటీ గురువారం జరగనుంది.