Smriti Mandhana- Palash Muchhal: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ వివాహం జరగాల్సి ఉంది. నవంబర్ 2025లో వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాల్సింది. కానీ అకస్మాత్తుగా పెళ్లి వాయిదా పడింది. ఆ తర్వాత తాము పెళ్లి చేసుకోవడం లేదని ఇద్దరూ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో ఒక షాకింగ్ మలుపు చోటుచేసుకుంది. స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడు విద్యాన్ మానే.. పలాష్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
స్మృతి స్నేహితుడి సంచలన వెల్లడి
పెళ్లి వేడుకలకు హాజరైన విద్యాన్ మానే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలాష్ మరొక మహిళతో పడకగదిలో అడ్డంగా దొరికిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న భారత మహిళా క్రికెటర్లు ఆగ్రహంతో పలాష్‌పై దాడి చేసి కొట్టారని ఆయన పేర్కొన్నారు. ‘హిందుస్థాన్ టైమ్స్’ కథనం ప్రకారం విద్యాన్ ఇలా అన్నారు. పెళ్లి వేడుకలు జరుగుతున్న సమయంలోనే అతను మరొక మహిళతో ఏకాంతంగా ఉంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఆ దృశ్యం చాలా దారుణంగా ఉంది. అది చూసిన భారత మహిళా క్రికెటర్లు అతడిని చితకబాదారు. ఆ కుటుంబం అంతా మోసగాళ్లే. పెళ్లి చేసుకుని అతను సాంగ్లీలో స్థిరపడతాడని నేను అనుకున్నాను, కానీ అంతా రివర్స్ అయ్యింది అని పేర్కొన్నారు.
Also Read: రంజీ ట్రోఫీ 2025-26.. మహ్మద్ షమీ మరోసారి మ్యాజిక్!
ఆర్థిక మోసం ఆరోపణలు
కేవలం వ్యక్తిగత విషయాలే కాకుండా పలాష్ తనను ఆర్థికంగా కూడా మోసం చేశాడని విద్యాన్ ఆరోపించారు. సినిమా తీస్తానని చెప్పి పలాష్ తన దగ్గర లక్షలాది రూపాయలు తీసుకున్నాడని ఆయన తెలిపారు. పెళ్లి రద్దయినప్పటి నుండి పలాష్ తన ఫోన్ కాల్స్ ఎత్తడం లేదని విద్యాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏం జరిగిందంటే?
స్మృతి మంధాన- పలాష్ వివాహం నవంబర్ 23, 2025న మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగాల్సి ఉంది. వేడుకలు కూడా ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే పెళ్లి రోజే వేడుక ఆగిపోయింది. ఆ సమయంలో స్మృతి తండ్రి అనారోగ్యానికి గురయ్యారని, అందుకే పెళ్లి వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు విద్యాన్ చేసిన వ్యాఖ్యలు పెళ్లి రద్దు వెనుక అసలు కారణం పలాష్ ప్రవర్తనేనని సూచిస్తున్నాయి.
