IND-W vs SA-W First ODI: దక్షిణాఫ్రికాపై సెంచరీతో కదం తొక్కిన స్మృతి మంధాన

దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో 143 పరుగుల భారీ తేడాతో భారత మహిళ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొదట స్మృతి మంధాన సెంచరీతో విధ్వంసం సృష్టించగా ఆ తర్వాత లెగ్ స్పిన్నర్ ఆశా శోభన

IND-W vs SA-W First ODI: దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో 143 పరుగుల భారీ తేడాతో భారత మహిళ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొదట స్మృతి మంధాన సెంచరీతో విధ్వంసం సృష్టించగా ఆ తర్వాత లెగ్ స్పిన్నర్ ఆశా శోభన తన తొలి మ్యాచ్‌లో అద్భుతాలు చేసి దక్షిణాఫ్రికాను కష్టాల్లో పడేసింది. ఫలితంగా భారత్ 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

స్మృతి మంధాన 127 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసింది. దీప్తి శర్మ 48 బంతుల్లో 37 పరుగులు చేసింది. పూజా వస్త్రాకర్ 42 బంతుల్లో 31 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా జట్టు 122 పరుగులకే కుప్పకూలింది. ఈ జట్టులో సునే లూస్ అత్యధికంగా 33 పరుగులు చేశాడు. శోభన నాలుగు వికెట్లు పడగొట్టింది. తన తొలి వన్డే మ్యాచ్‌ ఆడుతున్న ఆశా శోభన 36వ ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి భారత్ విజయాన్ని ఖాయం చేసింది. ఈ ఓవర్‌లో మొదట మసాబటా క్లాస్‌ని, ఆపై నాన్‌కులులేకో మలాబాను అవుట్ చేయడం ద్వారా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా 143 పరుగులతో సత్తా చాటగా, దక్షిణాఫ్రికా జట్టు 122 పరుగులకే సరిపెట్టింది.

చివరిసారిగా దక్షిణాఫ్రికాతో తలపడిన భారత జట్టు చివరి బంతికి ఓడిపోయింది. ఆ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మొత్తానికి ఈ సిరీస్‌ను విజయంతో ప్రారంభించింది.

Also Read: J&K: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై పరుగులు తీయనున్న ట్రైన్