Smriti Mandhana: భారతదేశ స్టార్ క్రీడాకారిణి స్మృతి మంధాన (Smriti Mandhana) డిసెంబర్‌లోనే పలాష్ ముచ్చల్‌ను వివాహం చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలోని సాంగ్లీలో వీరి వివాహ వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. కానీ పెళ్లి రోజునే వివాహం వాయిదా పడింది. అసలు విషయం ఏమిటంటే.. స్మృతి తండ్రికి అకస్మాత్తుగా ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. దీంతో పెళ్లిని వాయిదా వేశారు. ఇప్పుడు స్మృతి, పలాష్‌ల పెళ్లి డిసెంబర్ 7న జరగనుందా? ఈ ప్రశ్నకు స్మృతి సోదరుడు స్వయంగా సమాధానం ఇచ్చారు.
డిసెంబర్ 7న స్మృతి, పలాష్‌ల పెళ్లి జరుగుతుందా?
పలాష్ మరియు మంధానల వివాహం ఇప్పుడు డిసెంబర్ 7న జరగబోతుందని సోషల్ మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే ఈ ప్రశ్నకు సమాధానాన్ని స్మృతి సోదరుడు శ్రవణ్ మంధాన ఇచ్చారు. ఈ వార్త కేవలం పుకారు మాత్రమే అని కొట్టిపారేస్తూ.. “ఈ పుకార్ల గురించి నాకు ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతానికి ఇది (వివాహం) ఇంకా వాయిదాలోనే ఉంది” అని ఆయన చెప్పారు.
Also Read: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చనిపోలేదు.. కానీ: మాజీ ప్రధాని సోదరి
వాస్తవానికి నవంబర్ 23న వీరిద్దరి వివాహం జరగాల్సి ఉంది. అయితే పెళ్లి తంతు ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు స్మృతి తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. దీంతో వివాహం వాయిదా పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే పలాష్ కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. అయితే ఈ వివాహం వాయిదా పడటానికి కారణం స్మృతి తండ్రి అనారోగ్యం కాదని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అసలు కారణం పలాష్‌పై స్మృతిని మోసం చేశాడనే ఆరోపణలు రావడమేనని ఆ నివేదికలు తెలిపాయి.
పలాష్‌పై మోసం ఆరోపణలు వచ్చాయి
పలాష్ ముచ్చల్ కొరియోగ్రాఫర్‌తో ఫ్లర్ట్ చేశాడనే ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన మెసేజ్‌ల స్క్రీన్‌షాట్‌లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పెళ్లికి ఒక రోజు ముందు స్మృతి, పలాష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందని.. అందుకే వారి వివాహం వాయిదా పడిందని ఊహాగానాలు వచ్చాయి.
