Site icon HashtagU Telugu

Smriti Mandhana: స్మృతీ మంధాన–పలాష్ ముచ్చల్ పెళ్లి వేడుకలు హర్షోలాసంగా

Smriti Wedding

Smriti Wedding

సంగ్లీ, మహారాష్ట్ర। (Smirit Mandhana Wedding) భారత క్రికెటర్ స్మృతీ మంధాన మరియు బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ పెళ్లి వేడుకలు ఆహ్లాదకరంగా కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన మెహందీ కార్యక్రమంలో స్మృతీకి అత్యంత సన్నిహితులు, సహచర క్రికెటర్లు రాధా యాదవ్, జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పటిల్ పాల్గొని సందడి చేశారు. మెహందీ వేడుక పాటలు, నృత్యాలు, నవ్వులతో ఉత్సాహంగా సాగింది.

 

స్మృతీ మంధాన–పలాష్ ముచ్చల్ వివాహం ఆదివారం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరగనుంది. ఇప్పటికే ప్రీ-వెడ్డింగ్ క్రికెట్ మ్యాచ్, సంగీత్ వేడుకలతో వేడుకల ఆనందం మరింత పెరిగింది.

 

Exit mobile version