SL vs IND Highlights: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ (SL vs IND Highlights) ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. డక్‌వర్త్ లూయిస్ నియమావళి ప్రకారం భారత్‌కు 8 ఓవర్లలో 78 పరుగుల విజయ లక్ష్యం చేధించాల్సి ఉంది. అయితే భారత జట్టు 6.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీమిండియా సిరీస్‌ను సైతం కైవసం చేసుకుంది. భారత్ తరఫున కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 12 బంతుల్లో 26 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. అదే సమయంలో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ 15 బంతుల్లో 30 పరుగులు చేశాడు. శ్రీలంక తరఫున మహిష పతిరన, వనెందు హసరంగా, మతీశ తీక్షణ తలో వికెట్ తీశారు.’
Also Read: Paris Olympics 2024: షూటర్ మను భాకర్‌కు హర్యానా సీఎం శుభాకాంక్షలు
అంతకు ముందు భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. ఈ విధంగా 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియాకు వర్షం కారణంగా లక్ష్యాన్ని సవరించారు. అనంతరం భారత్‌కు 8 ఓవర్లలో 78 పరుగుల విజయలక్ష్యం లభించింది. వర్షం తర్వాత ఆట ప్రారంభమైనప్పుడు భారత్ 8 ఓవర్లలో 78 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి ఉంది. యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ ఓపెనింగ్ వచ్చారు. అయితే శాంసన్ ఖాతా తెరవకుండానే మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ సులువుగా పరుగులు సాధించారు. 51 పరుగుల స్కోరు వద్ద భారత జట్టుకు షాక్ తగిలింది. సూర్యకుమార్ యాదవ్.. మషితా పతిరనా బంతికి పెవిలియన్‌కు చేరుకున్నప్పటికీ అప్పటికి టీమ్ ఇండియా విజయం దాదాపు ఖాయమైంది.
We’re now on WhatsApp. Click to Join.
ఆ తర్వాత యశస్వి జైస్వాల్ రూపంలో భారత జట్టుకు మూడో దెబ్బ తగిలింది. యశస్వి జైస్వాల్ అవుట్ అయినప్పుడు భారత జట్టు స్కోరు 65 పరుగులు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు విజయానికి 13 పరుగులు మాత్రమే కావాలి. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో 22 పరుగులు చేసి గేమ్ ముగించాడు. దీంతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ తొలి సిరీస్‌లో విజయం సాధించాడు.