బంగ్లాదేశ్ టూర్ ను ముగించుకున్న టీమిండియా వారం రోజుల వ్యవధిలోనే సొంతగడ్డపై శ్రీలంకతో తలపడబోతోంది. భారత పర్యటనలో శ్రీలంక మూడు టీ ట్వంటీలు, మూడు వన్డేలు ఆడనుంది. భారత్ తో సిరీస్ కోసం లంక జట్టును ప్రకటించారు. లంక ప్రీమియర్ లీగ్ సత్తా చాటిన పలువురు ఆటగాళ్ళకు చోటు దక్కింది. నువాండు ఫెర్నాండో తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికవగా… ఇటీవలే నిషేధానికి గురైన కరుణారత్నే కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. బోర్డు కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కరుణారత్నేపై ఏడాది నిషేధం విధించారు. నిషేధాన్ని ఎందుకు తగ్గించారన్న దానిపై లంక బోర్డు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా
భారత పర్యటనలో దశున్ శనక శ్రీలంక జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ పర్యటన కోసం లంక క్రికెట్ బోర్డు హసరంగ, కుశాల్ మెండిస్ లను వైస్ కెప్టెన్ గా నియమించింది. ఆసియాకప్ , టీ ట్వంటీ ప్రపంచప్ లలో రాణించిన పలువురు ఆటగాళ్ళు కూడా భారత పర్యటనకు ఎంపికయ్యారు. భారత్ , శ్రీలంక మధ్య జనవరి 3 నుంచి టీ ట్వంటీ సిరీస్ మొదలు కానుంది. తొలి టీ ట్వంటీకి ముంబై, రెండో మ్యాచ్ కు పుణే, మూడో టీ ట్వంటీకి రాజ్ కోట్ ఆతిథ్యమివ్వనున్నాయి. అటు వన్డే సిరీస్ గౌహతి, కోల్ కతా, తిరువనంతపురంలో జరగనుంది.
భారత్ టూర్ కు శ్రీలంక జట్టు ః
నిస్సాంక, కుశాల్ మెండిస్ ( వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, అసలంక, దసున్ శనక ( కెప్టెన్ ), భనుక రాజపక్స , అసన్ భండార, నువాండు ఫెర్నాండో , సమరవిక్రీమా, హసరంగా , దునిత్ వెల్లాగ్లే, మహేశఅ తీక్షణ, జెప్రే వాండర్సే, కసున్ రజిత, లహిరు కుమారా, ప్రమోద్ మధుశాన్ , దిల్షాన్ మధుశనక, నువాన్ తుషారా , చమిక కరుణారత్నే, అవిష్క ఫెర్నాండో