Ind Vs SA 1st Innings: సూర్య కుమార్ విధ్వంసం… రెండో టీ ట్వంటీలో భారత్ భారీ స్కోరు

సౌతాఫ్రికాపై సీరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా గుహావటి వేదికగా జరుగుతున్న రెండో టీ ట్వంటీలో అదరగొట్టింది.

  • Written By:
  • Updated On - October 2, 2022 / 09:06 PM IST

సౌతాఫ్రికాపై సీరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా గుహావటి వేదికగా జరుగుతున్న రెండో టీ ట్వంటీలో అదరగొట్టింది. బ్యాటింగ్ లో కీలక ఆటగాళ్ళు రాణించడంతో భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు కే ఎల్ రాహుల్, రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. సఫారీ బౌలర్ల పై తొలి బంతి నుంచే విరుచుకుపడిన వీరిద్దరూ చెలరేగిపోయారు. తొలి వికెట్ కు 9.5 ఓవర్లలో 96 పరుగులు జోడించారు. రోహిత్ , రాహుల్ పోటాపోటీగా బౌండరీల వర్షం కురిపించారు.

రోహిత్ 37 బంతుల్లో 7 ఫోర్లు , 1 సిక్సర్ తో 43 , కే ఎల్ రాహుల్ 28 బంతుల్లో 5 ఫోర్లు , 4 సిక్సర్లతో 57 రన్స్ చేశారు. వీరిద్దరూ ఔటయ్యాక కోహ్లీ , సూర్య కుమార్ అదే దూకుడు కొనసాగించారు. ఫామ్ లో ఉన్న సూర్య కుమార్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. మరోసారి సఫారీ బౌలర్లను ఉతికి ఆరేసాడు. స్టేడియం నలువైపులా బౌండరీలు బాదేసాడు. అటు కోహ్లీ కూడా ధాటిగా ఆడడంతో స్కోర్ బోర్డు టాప్ గేర్ లో దూసుకెళ్లింది. కోహ్లీ , సూర్య జోరుకు సఫారీ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. వీరిద్దరూ క్రీజులో ఉండగా రన్ రేట్ ఓవర్ కు 15 పైగా సాగింది. ఈ క్రమంలో సూర్య కుమార్ కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా టీ ట్వంటీల్లో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన మూడో భారత క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. సూర్య కుమార్ యాదవ్ 22 బంతుల్లో 5 ఫోర్లు , 5 సిక్సర్లతో 61 పరుగులకు ఔటయ్యాడు. సూర్య , కోహ్లీ మూడో వికెట్ కు 6.4 ఓవర్లలో 102 రన్స్ పార్ట్ నర్ షిప్ నెలకొల్పారు.
చివర్లో దినేష్ కార్తిక్ 7 బాల్స్ లో 2 సిక్సర్లతో 17 రన్స్ చేయదాంతో భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగులు చేసింది. కోహ్లీ 7 ఫోర్లు , 1 సిక్సర్ తో 49 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.

https://twitter.com/BCCI/status/1576588846263062528/video/1