Site icon HashtagU Telugu

IPL 2022 : కేన్ మామ వ‌చ్చేశాడు

Kane Williamson

Kane Williamson

ఐపీఎల్ 2022 సీజన్‌కు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో జట్లన్నీ ముంబైకి చేరుకుంటున్నాయి. ఐపీఎల్ 15వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తాజాగా ముంబైలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కేన్ విలియమ్సన్ జట్టుతో కలిసిన వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.. కెన్ విలియంసన్ రాకను గురించి తెలియజేస్తూ ‘వేసవిలో కూడా వాతావరణం ప్రశాంతంగా ఉందంటే.. సన్‌రైజర్స్ శిబిరంలో ఎవరో చేరుతున్నారు.. వెల్‌కమ్ కేన్ మామా అని తమ జట్టు సారథిగా స్వగతం పలికింది. విలియంసన్ జట్టుతో కలిసిన వీడియోకు సూపర్ స్టార్ మహేష్ బాబు నైటించిన బిజినెస్ మ్యాన్ సినిమాలోని ‘సారొస్తారొస్తారా..’ సాంగ్‌ను జత చేసింది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఐపీఎల్ 2022లో భాగంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టు మార్చి 29న రాజస్థాన్ రాయల్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడ‌నుంది. ఇక ఈసారి ఐపీఎల్ లో టైటిల్ గెలవడమే టార్గెట్ గా బరిలోకి దిగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ అందుకు అనుగుణంగానే మెగా వేలంలో జట్టుని కొనుగోలు చేసింది.. సన్ రైజర్స్ అత్యధికంగా వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌కు 10 కోట్ల 75 లక్షలు చెల్లించింది. అలాగే టీమిండియా యువ ఆటగాడు వాషిం‍గ్టన్‌ సుందర్‌ను దక్కించుకుంది. అతడి కోసం రూ. 8 కోట్ల 75 లక్షలు ఖర్చు చేసింది. మొత్తంగా ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో 23 మంది ఆటగాళ్లు ఉండగా.. ఇందులో 8 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు.