Site icon HashtagU Telugu

IND vs AUS: తొలి టెస్టులో అదరగొడుతున్న భారత బౌలర్లు.. కష్టాల్లో ఆసీస్

ind vs aus

Resizeimagesize (1280 X 720) (2) 11zon

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తొలిటెస్టులో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. తొలి సెషన్‌ ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్లు డేవిడ్ వార్నర్(1), ఉస్మాన్ ఖవాజా(1)ను ఔట్ చేశారు. తొలుత సిరాజ్‌ బౌలింగ్‌లో(1.1వ ఓవర్) ఖవాజా ఎల్బీ కాగా.. తర్వాతి ఓవర్‌లోనే వార్నర్‌ను షమీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 36 ఓవర్ వేసిన జడేజా ఆ ఓవర్ లో చివరి రెండు బంతులకి లబుషేన్, రెన్‌షాను అవుట్ చేసాడు. లబుషేన్ 49 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే క్రీజ్ లోకి వచ్చిన మాథ్యూ రెన్‌షా (0) ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. ప్రస్తుతం ఆసీస్‌ 38 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. స్టీవ్‌స్మిత్ (25*), హాండ్స్ కాంబ్ (0 నాటౌట్) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Also Read: Formula E Racing: ఫార్ములా E ప్రపంచ ఛాంపియన్‌షిప్ రేసుకు అంతా రెడీ!

అంతకుముందు.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేడు మొదలైన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకుంది. బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీ-2023 తొలి టెస్టు సందర్భంగా టీమిండియా టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఆంధ్ర ఆటగాడు కేఎస్‌ భరత్‌ తొలిసారి భారత తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. భరత్‌కు పుజారా టెస్ట్ క్యాప్ అందించగా, సూర్యకు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి క్యాప్ అందించాడు. మరోవైపు.. టాడ్‌ మర్ఫీకి తొలిసారి ఆస్ట్రేలియా తరఫున తొలి టెస్టు ఆడే అవకాశం లభించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో స్థానాన్ని ఆశిస్తున్న భారత్‌కు ఈ సిరీస్‌ మరింత కీలకం కానుంది. కనీసం మూడు టెస్టులు గెలిస్తేనే రోహిత్‌సేన డబ్ల్యూటీసీ టైటిల్‌ సమరానికి అర్హత సాధించగలుగుతుంది.