Site icon HashtagU Telugu

Sindhu Wins Singapore Open: సింధుదే సింగపూర్ ఓపెన్

PV Sindhu

PV Sindhu

భారత్ అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మరోసారి అదరగొట్టింది. తన కెరీర్ లో తొలిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో సింధు 21-9, 11-21, 21-15 స్కోర్ తో వరల్డ్ నంబర్ 11 , చైనా ప్లేయర్ వాంగ్ పై విజయం సాధించింది. తొలి గేమ్ ఆరంభం నుంచే సింధు దూకుడుగా ఆడింది. కోర్టు నలువైపులా షాట్స్ కొడుతూ ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేసింది. దీంతో వాంగ్ అనవసర తప్పిదాలతో వరుస పాయింట్లు కోల్పోయింది. తొలి గేమ్ ను సింధు 21-9 తో గెలుచుకుంది. అయితే రెండో గేమ్ లో వాంగ్ అద్భుతంగా పుంజుకుంది.

సింధు కాస్త పోటీ ఇచ్చినా ఆధిక్యం నిలుపుకున్న వాంగ్ గేమ్ గెలిచి స్కోర్ సమం చేసింది. ఇక మ్యాచ్ డిసైడర్ మూడో గేమ్ ఆసక్తికరంగా సాగింది. అయితే వరుస స్మాష్ లతో ఆధిక్యంలో నిలిచిన చివరి వరకూ దానిని కాపాడుకుని టైటిల్ సొంతం చేసుకుంది. సింధు కెరీర్ లో ఇదే తొలి సింగపూర్ ఓపెన్ టైటిల్. అలాగే ఈ ఏడాది మూడో టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది రెండు సూపర్‌ 300 టైటిల్స్‌ సయ్యద్‌ మోదీ, స్విస్‌ ఓపెన్‌ సాధించిన తెలుగు తేజం కామన్ వెల్త్ గేమ్స్ కు ముందు తన ఫామ్ కంటిన్యూ చేసింది.

Exit mobile version