Site icon HashtagU Telugu

World Cup 2023: వరల్డ్ కప్ నుంచి గిల్ అవుటేనా?

World Cup 2023

New Web Story Copy 2023 08 10t182649.114

World Cup 2023: వరల్డ్ కప్ దగ్గరపడుతోంది. ఐసీసీ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఇప్పటికే ఆస్ట్రేలియా తమ జట్టుని ప్రకటించింది. ఇటు చూస్తే టీమిండియా పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. దంచికొట్టే బ్యాటర్ వక్కారు కనిపించడంలేదు. ఉన్న ఇద్దరు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సంగతి పక్కనపెడితే మిగతా ఆటగాళ్లెవరూ ఆశాజనకంగా కనిపించడంలేదు. సూర్య కుమార్ యాదవ్ ఎప్పుడో బ్యాట్ ఝళిపిస్తాడో ఆయనకే తెలియదు. ఇక మరో కోహ్లీ అనుకున్న శుభ్ మన్ గిల్ అతని స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసి జట్టులో పాతుకుపోయాడు. గత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ ని ఫైనల్ కి చేర్చడంలో కీ రోల్ ప్లే పోషించాడు. ఆ తరువాత గిల్ పేలవ ప్రదర్శన మొదలైంది. మరీ ముఖ్యంగా వెస్టిండీస్ పర్యటన చూస్తే ఈ వరల్డ్ కప్ లో గిల్ అవసరం లేదనిపిస్తుంది.గిల్ ఆట తీరు చూసి మాజీలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జట్టు కూర్పు విషయంలో టీమిండియా మల్ల గుల్లాలు పడుతుంది. శ్రేయాస్ అయ్యర్, రాహుల్, పంత్ లాంటి కీలక ప్లేయర్లు గాయం కారణంగా మిడిల్ ఆర్డర్ పెద్ద సమస్యగా మారింది. ఓపెనర్లు, మిడిల్ అర్దర్లు చేతులెత్తేస్తే బౌలింగ్ విభాగంతో కప్ గెలవలేరు కదా.ఈ సమయంలో సెలెక్టర్ల చూపు యువ ఓపెనర్ పృథ్వీ షా పై పడింది.

కొంతకాలంగా టీమిండియా దూరమైన పృథ్వీ షా ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లాండ్ లో జరుగుతున్న డొమెస్టిక్ వన్డే కప్ టోర్నీలో తూఫాన్ ఇన్నింగ్స్ తో సంచలనం సృష్టించాడు. సెంచరీ కాదు ఏకంగా డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ టోర్నీలో నార్తాంప్టన్ షైర్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా.. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 153 బంతుల్లో 244 పరుగులు చేసి చరిత్ర తిరగరాశారు. ఈ ఇన్నింగ్స్ లో 39 బౌండరీలు బాదాడంటే బౌలర్ల పరిస్థి ఒక్కసారి అర్ధం చేసుకోవచ్చు. ఈ ఒక్క ఇన్నింగ్స్ తో వన్డే వరల్డ్ కప్ రేస్ లో తాను కూడా ఉన్నట్లుగా సంకేతాలిచ్చాడు. పృథ్వీ షా ఆటకు ఫిదా అయిన సెలెక్టర్లు ఓ నిర్ణయానికి వచినట్టు తెలుస్తుంది. పృథ్వీ షాకి వన్డే ప్రపంచ కప్ లో స్థానం కల్పించాలని భావిస్తున్నారట. షా ఎంట్రీ ఇస్తే శుభ మాన్ గిల్ కు ఉద్వాసన తప్పదంటున్నారు విశ్లేషకులు. దీంతో శుభమన్ గిల్ ప్లేస్ డేంజర్ జోన్ లో పడ్డట్టేనాని అర్ధమవుతుంది.

Read More: Renu Desai on Pawan: పవన్ డబ్బు మనిషి కాదు.. ఆయనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి: రేణుదేశాయ్