Shubman Gill: దక్షిణాఫ్రికాతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ నుండి భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) గాయం కారణంగా వైదొలిగారు. గిల్ స్థానంలో ఇప్పుడు రిషభ్ పంత్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టెస్ట్ మ్యాచ్ రెండవ రోజు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గిల్‌కు మెడ నొప్పి (Neck Pain) రావడంతో అతను రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడారు.
బీసీసీఐ (BCCI) అధికారిక ప్రకటన
శుభ్‌మన్ గిల్ గాయంపై బీసీసీఐ తన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. కోల్‌కతాలో దక్షిణాఫ్రికాకు వ్యతిరేకంగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రెండవ రోజున కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు మెడకు గాయమైంది. ఆ రోజు ఆట ముగిసిన తర్వాత, వైద్య పరీక్షల కోసం అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలోనే ఉన్నారు. అతను మొదటి టెస్ట్ నుండి వైదొలిగారు. బీసీసీఐ వైద్య బృందం అతడిని నిరంతరం పర్యవేక్షిస్తుంది అని తెలిపింది.
Also Read: Chandrababu: రాజ్యాంగం వల్లే సామాన్యుడు అత్యున్నత పదవికి: సీఎం చంద్రబాబు
పటిష్ట స్థితిలో టీమ్ ఇండియా
కోల్‌కతా టెస్ట్‌లో టాస్ గెలిచిన టెంబా బావుమా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దక్షిణాఫ్రికా (మొదటి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే ఆలౌట్ అయింది. జస్ప్రీత్ బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. టీమ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 30 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే సంపాదించి, 189 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ తరఫున అత్యధిక పరుగులు కేఎల్ రాహుల్ (39) చేశాడు. సైమన్ హార్మర్ 4 వికెట్లు తీశాడు. ఇకపోతే సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే ఆలౌటైంది. ప్రస్తుతం టీమిండియా 4 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. మరో 75 పరుగులు చేస్తే భారత్ విజయం సాధిస్తుంది.
