Gill Tests Positive For Dengue: టీమిండియాకు బిగ్ షాక్.. కీలక ఆటగాడికి డెంగ్యూ..? ఆస్ట్రేలియాతో మ్యాచ్ కి డౌటే..!

ప్రపంచ కప్ 2023 ప్రారంభమైంది. ఇందులో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆదివారం ఆస్ట్రేలియాతో జరగనుంది. దీనికి ముందు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగ్యూ (Gill Tests Positive For Dengue) బారిన పడ్డాడు.

Published By: HashtagU Telugu Desk
Shubman Gill

Shubman Gill

Gill Tests Positive For Dengue: ప్రపంచ కప్ 2023 ప్రారంభమైంది. ఇందులో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆదివారం ఆస్ట్రేలియాతో జరగనుంది. దీనికి ముందు భారతీయ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగ్యూ (Gill Tests Positive For Dengue) బారిన పడ్డాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కు గిల్ కూడా దూరంగా ఉండవచ్చు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు ఎంఏ చిదంబరం స్టేడియంలో టీమ్ ఇండియా ప్రాక్టీస్ చేస్తోంది. కానీ శుభ్‌మన్ ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. అతనికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా వచ్చింది. ప్రస్తుతం శుభ్‌మన్‌.. బీసీసీఐ యాజమాన్యం, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శుక్రవారం మరోసారి అతనికి పరీక్షలు నిర్వహించనున్నారు. శుభమాన్ కోలుకుంటే ఆడే అవకాశం ఉంది. కానీ కోలుకోకపోతే ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌కు దూరమైనట్టే.

Also Read: World Cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్‌కు షాక్‌… ఇంగ్లాండ్‌పై కివీస్ ఘనవిజయం

We’re now on WhatsApp. Click to Join

భారత జట్టు గిల్ కు ప్రత్యామ్నాయం కోసం వెతుకుతోంది. ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌ రూపంలో భారత్‌కు రెండు ఆప్షన్లు ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇవ్వవచ్చు. KL రాహుల్ గురించి మాట్లాడుకుంటే.. భారతదేశం తరపున 16 ODI మ్యాచ్‌లలో నంబర్ 1 ఓపెనర్‌గా ఆడాడు. ఈ సమయంలో అతను 669 పరుగులు చేశాడు. ఈ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న రాహుల్ 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. 2వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను 7 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో 246 పరుగులు చేశాడు. ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్ ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆదివారం చెన్నైలో జరగనుంది. అక్టోబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.

  Last Updated: 06 Oct 2023, 08:56 AM IST