Site icon HashtagU Telugu

Shubman Gill: శుభ్‌మ‌న్ సెల్ఫీ విత్ లయన్

Shubman Gill

Shubman Gill

Shubman Gill: రెండు టెస్టుల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు ఖాళీ సమయంలో రిలాక్స్ అవుతున్నారు.టెస్టుకు ముందు టీమిండియా వైల్డ్‌లైఫ్ స‌ఫారీకి వెళ్లింది. ఈ టూర్ లో టీమ్ ఇండియా రైజింగ్ స్టార్ శుభ్‌మాన్ గిల్ తన టీమ్ మెట్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. సహచరులతో కలిసి జంగిల్ సఫారీకి వెళ్లి సింహంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింహంతో సెల్ఫీ పిక్ వైరల్ కావడంతో గుజరాత్ టైటాన్స్ రియాక్ట్ అయింది. లయన్ హార్ట్ అని కామెంట్ చేసింది. ఇక నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సెల్ఫీ విత్ లయన్ అని, సింహంతో మరో సింహం అని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా డిసెంబ‌ర్ 26 నుంచి సెంచూరియ‌న్ వేదిక‌గా దక్షిణాఫ్రికాతో మొద‌టి టెస్టు ఆరంభం కానుంది. టీమ్ఇండియా ద‌క్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలుచుకోలేదు. 8 సార్లు ఆదేశంలో ప‌ర్య‌టించిన భార‌త్ రిక్త‌హ‌స్తాల‌తోనే ఇంటికి వ‌చ్చింది. ఈ సారి రోహిత్ నాయక‌త్వంలో ఎలాగైనా టెస్టు సిరీస్‌ను గెలిచి తీరాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది.

Also Read: IPL 2024: ముంబై, గుజరాత్ చీకటి ఒప్పందం: హార్దిక్ కోసం 100 కోట్లు