గుజరాత్ టైటాన్స్ సభ్యుడు శుభ్ మన్ గిల్, బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ఒక్క చోట చేరితే..? అభిమానుల్లో సందేహాలు మొలకెత్తుతాయి. వీరిద్దరూ కలసి ముంబైలోని బాస్టియన్ రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తుండగా ఓ అభిమాని దీన్ని తన ఫోన్ లో బంధించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. రెస్టారెంట్ కు వీరు కలసి వెళ్లడం, వెయిటర్ కు ఆర్డర్ చేయడం ఇవన్నీ వీడియోలో రికార్డు అయ్యాయి. వీరిద్దరూ కలవడం వెనుక ఏ బంధం అయి ఉంటుంది? అన్నది అభిమానుల మనసులను తొలుస్తోంది. కామెంట్ల రూపంలో దీన్నే వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సారా అంటే గిల్ కు మక్కువ అంటూ ఓ యూజర్ ట్విట్టర్లో స్పందించాడు.
Shubham Gill Dating:శుభ్ మన్ గిల్తో బాలీవుడ్ నటి సారా అలీఖాన్ డిన్నర్

Shubham