Site icon HashtagU Telugu

IND vs AUS 3rd ODI: గిల్ ను పక్కనపెట్టిన రోహిత్

Ind Vs Aus

Ind Vs Aus

IND vs AUS 3rd ODI: సొంతగడ్డపై సన్నాహక సిరీస్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. బలమైన ప్రత్యర్థుల్ని నేలకూలుస్తు సత్తా చాటుతున్నారు కుర్రాళ్ళు. ఆస్ట్రేలియాతో ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలిచింది. కాగా చివరిదైన మూడో వన్డే కోసం ఇద్దరు ప్లేయర్స్ కు విశ్రాంతినిచ్చింది. రెండో వన్డేలో సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్, ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ లను మూడో వన్డేకు విశ్రాంతినిచ్చింది. దీంతో గిల్, ఠాకూర్ మూడో మ్యాచ్ కోసం టీమ్ తో కలిసి రాజ్‌కోట్ వెళ్లడం లేదు.

భారత్ – ఆస్ట్రేలియా మధ్య వచ్చే బుధవారం రాజ్‌కోట్ వేదికగా మూడో వన్డే జరగనుంది. అయితే ఇప్పటికే సిరీస్ గెలుచుకున్న టీమిండియా మూడో వన్డేలోను గెలిచి క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్దమవుతుంది. మరోవైపు రెండు వన్డేలకు దూరంగా ఉన్న రోహిత్, కోహ్లీ, పాండ్య జట్టులో జాయిన్ కానున్నారు . ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో 74, 104 స్కోర్లతో గిల్ అదరగొట్టిన విషయం తెలిసిందే. రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ, రోహిత్, హార్దిక్ లు మూడో మ్యాచులోకి వస్తున్న సమయంలో గిల్, ఠాకూర్ కి విశ్రాంతి కల్పించారు. ఆదివారం ఇండోర్‌లో రెండో వన్డే ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లంతా రాజ్‌కోట్‌కు వెళ్లగా గిల్, ఠాకూర్ మాత్రం వారితో వెళ్లలేదు. ఈ ఇద్దరూ గువహతిలో భారత జట్టుతో కలుస్తారు.

ప్రపంచ కప్ కు ముందు టీమిండియా ఈనెల 30న వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఆ తరువాత అక్టోబర్ 5న ప్రపంచ కప్ మహాసంగ్రామం ప్రారంభమవుతుంది. ఇంగ్లాండ్‌తో భారత వరల్డ్ కప్ వేట మొదలవుతుంది.

Also Read: Sailajanath : బాబు అరెస్ట్ బీజేపీకి తెలియకుండా జరగదు – ఏపీసీసీ మాజీ అధ్య‌క్షుడు చీఫ్ శైల‌జానాథ్‌