Site icon HashtagU Telugu

Shubman Gill: శుభ్‌మన్‌ గిల్ సూపర్ సెంచరీ.. ధీటుగా ఆడుతున్న టీమిండియా

Gill

Resizeimagesize (1280 X 720) (8) 11zon

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (103) శతకం సాధించాడు. శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) కెరీర్‌లో ఇది రెండో సెంచరీ. కెప్టెన్ రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పుజారా (42)తో కలిసి గిల్‌ ఓ మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. పుజారా 42 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 63 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్ (103), విరాట్ కోహ్లీ క్రీజ్ లో ఉన్నారు.

శుభ్‌మన్ గిల్ 194 బంతుల్లో రెండో టెస్టు సెంచరీ సాధించాడు. అతను టాడ్ మర్ఫీ బౌలింగ్ లో ఫైన్ లెగ్ మీద ఫోర్ కొట్టి తన సెంచరీని పూర్తి చేశాడు. ఓవరాల్‌గా ఇది అతనికి ఏడో అంతర్జాతీయ సెంచరీ. శుభ్‌మన్ వన్డేల్లో నాలుగు సెంచరీలు, టీ20ల్లో ఒక సెంచరీ సాధించాడు. శుభ్‌మన్ తన టెస్టు కెరీర్‌లో బంగ్లాదేశ్‌పై తొలి సెంచరీ సాధించాడు.

Also Read: Rohit Sharma: అహ్మదాబాద్ టెస్టులో రోహిత్ శర్మ అరుదైన ఘనత

శుభ్‌మన్ సెంచరీ చేసిన ఓవర్‌లో అదే ఓవర్ చివరి బంతికి ఛెతేశ్వర్ పుజారా ఔటయ్యాడు. అతన్ని టాడ్ మర్ఫీ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. 121 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 42 పరుగుల వద్ద పుజారా హాఫ్ సెంచరీకి దూరమయ్యాడు. శుభ్‌మన్‌తో కలిసి పుజారా రెండో వికెట్‌కు 248 బంతుల్లో 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుతం 103 పరుగులతో శుభ్‌మన్ గిల్ క్రీజులో ఉండగా, ఖాతా తెరవకుండానే విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నారు. టీ సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా కంటే 292 పరుగులు వెనుకబడి ఉంది.