Shubman Gill- Rishabh Pant: పంత్‌, గిల్‌.. టీమిండియా మూడు ఫార్మాట్లకు కాబోయే కెప్టెన్లు..!

2024 దులీప్ ట్రోఫీకి కూడా శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్ ఎ జట్టుకు కెప్టెన్‌గా నియమితులయ్యారు. అంతకుముందు శ్రీలంక పర్యటనలో గిల్ వన్డే, T20 సిరీస్‌లలో టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

Published By: HashtagU Telugu Desk
Shubman Gill- Rishabh Pant

Shubman Gill- Rishabh Pant

Shubman Gill- Rishabh Pant: రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. టైటిల్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే వన్డే, టెస్టు జట్టుకు రోహిత్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. రోహిత్ ఇంకా ఎక్కువ ఆడాలని అనుకుంటున్నా.. వయసును దృష్టిలో పెట్టుకుని రోహిత్ టీ20 క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన‌ట్లు తెలిపాడు.

ఇప్పుడు మూడు ఫార్మాట్లలో రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ (Shubman Gill- Rishabh Pant) ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే రోహిత్ శర్మ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్‌లు టీమిండియాకు కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ భారత మాజీ దిగ్గజం భవిష్యత్తులో టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా ఉండగల ఇద్దరు ఆటగాళ్ల పేర్లను పేర్కొన్నాడు.

Also Read: Treatment At Home: ఇక‌పై ఇంట్లోనే చికిత్స‌.. టెలి మెడిసిన్ సేవ‌లు ప్రారంభించిన ఢిల్లీ..!

దినేష్ కార్తీక్ ఇద్దరు ఆట‌గాళ్ల పేర్లు చెప్పాడు

టీమ్ ఇండియా మాజీ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్‌ను మూడు ఫార్మాట్‌లలో భారత జట్టుకు కాబోయే కెప్టెన్ గురించి అడిగినప్పుడు ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన స‌మాధానం ఇచ్చాడు. దినేష్ కార్తీక్ క్రిక్‌బజ్‌లో మాట్లాడుతూ.. ఈ ప్ర‌శ్న‌కు ఇద్దరు ఆటగాళ్ల పేర్లు నేరుగా నా మనసులోకి వచ్చాయి. యువకులు, సత్తా ఉన్నవారు భవిష్యత్తులో టీమ్‌ఇండియాకు సారథ్యం వహించవచ్చు. అందులో మొదట రిషబ్ పంత్, రెండు శుభమన్ గిల్ అని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌లో ఆ ఇద్దరు ఆటగాళ్లు కెప్టెన్లుగా ఉన్నారని కార్తీక్ చెప్పాడు. కాగా భారత జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉన్నాడు. కాలక్రమేణా అతను మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు కెప్టెన్‌గా మారే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను అని డీకే చెప్పాడు. 2024 దులీప్ ట్రోఫీకి కూడా శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్ ఎ జట్టుకు కెప్టెన్‌గా నియమితులయ్యారు. అంతకుముందు శ్రీలంక పర్యటనలో గిల్ వన్డే, T20 సిరీస్‌లలో టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో రోహిత్ శర్మ తర్వాత గిల్ భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  Last Updated: 10 Sep 2024, 10:57 AM IST