Site icon HashtagU Telugu

Shubman Gill: ప్రాక్టీస్ మొదలుపెట్టిన గిల్.. తుది జట్టుపై ఆందోళన

India Squad

India Squad

Shubman Gill: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇద్దరు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లు జట్టులో లేకుండానే టీమ్ ఇండియా విజయకేతనం ఎగురవేసింది. కొడుకు పుట్టడంతో రోహిత్ శర్మ తొలి మ్యాచ్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే రెండో టెస్టుకు వీళ్ళిద్దరూ అందుబాటులోకి వచ్చారు, రోహిత్ శర్మ ఇప్పటికే జట్టుతో జతకట్టగా గిల్ కూడా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. నెట్స్‌లో గిల్ బ్యాటింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

గిల్ రాకతో కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ లో టెన్షన్ మొదలైంది. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ తో మ్యాచ్‌లో గిల్‌కి అవకాశం దక్కింది. చూస్తుంటే రెండో టెస్టు మ్యాచ్‌కి ముందు గిల్ పూర్తిగా ఫిట్‌నెస్ సాధించవచ్చు. రెండో టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో ప్రారంభం కానుంది. దీనికి చాలా సమయం ఉంది. ఈ గ్యాప్ లో గిల్ పూర్తిగా కోలుకుంటాడు. గిల్ రాకతో తుది జట్టు క్లిష్టంగా మారింది. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నితీష్‌రెడ్డి బ్యాటింగ్‌ తో అద్భుతంగ రాణించాడు. దేవదత్ పడిక్కల్ తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచినా, రెండో ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో 77 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

Also Read: Assembly Winter Session : డిసెంబర్‌ 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

గిల్ చాలా కాలంగా 3వ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. పైగా గిల్‌కి గతంలో ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం కూడా ఉంది. మరోవైపు గతంలో ఇదే మైదానంలో టీమిండియా దారుణంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కేవలం 36 పరుగులకే ఆలౌటైంది. ఈసారి అలా జరగకుండా ఉండాలంటే జట్టు కూర్పుపై జాగ్రత్త వహించక తప్పదు. ఇప్పుడు గిల్ ఎంట్రీ ఇవ్వడంతో ఎవరిని పక్కన పెట్టాలో అని జట్టు మేనేజ్మెంట్ తల పట్టుకుంటుంది. అటు జైస్వాల్‌తో రోహిత్ ఓపెనింగ్ చేసే ఛాన్సు ఉన్న‌ది. ఇక వ‌న్‌డౌన్‌లో రాహుల్ వ‌స్తాడ‌నుకుంటున్నారు. అదే జ‌రిగితే గిల్ అయిదో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వ‌స్తుంది. మరి గిల్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేయడం అరుదనే చెప్పాలి. కాగా గిల్ ఎంట్రీతో ఎవర్ని పక్కనపెడతారో చూడాలి.

Exit mobile version