Site icon HashtagU Telugu

Shubman Gill: కోలుకోని గిల్.. రెండో మ్యాచ్ కు దూరమే!

Shubman Gill

Shubman Gill

Shubman Gill: టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్ కు దూరమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా బీసీసీ ఈ కీలక అటగాడికి సంబంధించిన అప్డేట్ ను ఇచ్చింది. గిల్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఆఫ్ఘనిస్థాన్ తో బుధవారం (అక్టోబర్ 11) జరగబోయే రెండో మ్యాచ్ కూడా ఆడటం లేదని స్పష్టం చేసింది.

శుభ్‌మన్ గిల్ వరల్డ్ కప్‌లో వరుసగా రెండో మ్యాచ్‌కూ దూరమయ్యాడు. డెంగ్యూ బారిన పడిన గిల్.. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. రెండో మ్యాచ్ కోసం టీమిండియా ఇప్పటికే ఢిల్లీ బయలుదేరగా.. శుభ్‌మన్ గిల్ మాత్రం చెన్నైలోనే ఉండిపోయాడు. అతడు ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే అతడు పాకిస్థాన్ తో శనివారం (అక్టోబర్ 14) జరగబోయే కీలక మ్యాచ్ సమయానికి పూర్తిగా కోలుకుంటాడన్న ఆశాభావంతో టీమ్ మేనేజ్‌మెంట్ ఉంది.