Site icon HashtagU Telugu

Shubman Gill @200: డబుల్ సెంచరీ కొట్టిన గిల్.. భారత్ భారీ స్కోర్!

Gill Dobule

Gill Dobule

టీంఇండియా (Team India) యువ బ్యాటర్ శుభ్‌మన్ (Shubman Gill) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సులతో న్యూజిలాండ్ బౌలింగ్ ను చీల్చిచండాడు. బంతి ఉన్నది కొట్టడానికే అన్నట్టుగా కసితీరా బాదాడు. ఈ క్రమంలో గిల్ 87 బంతుల్లోనే గిల్ (Shubman Gill) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 145 బంతుల్లో డబుల్ సెంచరీ (Dobule Century) సాధించాడు. కెరీర్ లో డబుల్ సెంచరీ సాధించి అందర్నీ ద్రుష్టిని ఆకట్టుకున్నాడు. ఉప్పల్ స్టేడియం (Uppal stadium) వేదికగా జరగుతున్న తొలి వన్డేలో రోహిత్, కోహ్లీ నిరాశపర్చినా  వన్డేల్లో శుభ్‌మన్ గిల్‌ డబుల్ సెంచరీ క్రికెట్స్ లవర్స్ లో ఆనందం నింపింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో కూడా శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సెంచరీ (116 పరుగులు) సాధించిన సంగతి తెలిసిందే. మంచి ఫామ్‌లో ఉన్న గిల్ న్యూజిలాండ్ వన్డేలో కూడా తన దూకుడు కొనసాగించాడు. వరుసగా మంచి ఇన్నింగ్స్ ఆడుతూ, ఇండియాకు మంచి ఓపెనర్‌గా నిలుస్తున్నాడు.

తొలుత టాస్ గెలిచిన టీమిండియా (Team India) బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ (Rohit Sharma), గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. రోహిత్ శర్మ 38 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ నిరాశ పరిచాడు. కోహ్లీ 10 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. మరో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ 14 బంతుల్లో 5 పరుగులే చేసి ఔటయ్యాడు. లేటెస్ట్ సెన్సేషన్ సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav) 26 బంతుల్లో 31 పరుగులు చేసి మిచెల్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 50 ఓవర్లలో టీంఇండియా 349 పరుగులు సాధించి ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టుకు సవాల్ విసిరింది.

Also Read: Amala Paul: అమలా పాల్ కు అవమానం.. కేరళ గుడిలోకి నో ఎంట్రీ!