Shubman Gill: ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ ఫైనల్‌లో గురు శిష్యులు తలపడబోతున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ బరిలోకి దిగుతుంది. ఇక క్వాలిఫయర్ లో చెన్నై మీద ఓడి, ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబైపై ఘన విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ రెండవ సారి కప్ ముద్దాడేందుకు రంగంలోకి దిగనుంది.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా నిలిచాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మూడు సెంచరీలు సాధించిన శుభ్‌మన్ గిల్ ఫైనల్ లో అతని ప్రదర్శనపై ఎవరికీ వారు లెక్కలేసుకుంటున్నారు. నిజానికి గుజరాత్ ఫైనల్ చేరేందుకు గిల్ పాత్ర ఎంతో ఉంది. గిల్ భారీ స్కోర్ కారణంగానే ప్రత్యర్థి జట్లు గుజరాత్ పై ఓటమి చవి చూశాయి.
ఈ సీజన్ ధోనికి ప్రత్యేకం. ఈ సీజన్ తరువాత ధోనీ ఆడతాడో లేదో క్లారిటీ లేదు. ఎడమ మోకాలికి బ్యాండేజ్‌తో ఈ సీజన్ మొత్తం ఆడాడు. అటు వయసు మీద పడటం కూడా సమస్యగా చెప్పుకోవచ్చు. ధోని చాలా మ్యాచ్‌లలో ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. ధోనీ చరిష్మా ఎప్పటికీ అంతం కాదు. ఈ నేపథ్యంలో ధోని కోసమైనా చెన్నై జట్టు కప్ గెలిచేందుకు చమటోడుస్తుంది. ధోనీకి ఘనమైన వీడ్కోలు ఇచ్చేందుకు ఎల్లో ఆర్మీ సిద్ధపడుతుంది. అయితే శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్ ఎల్లో ఆర్మీకి ప్రమాదంగా మారే అవకాశముంది.
ఈ ఐపీఎల్ సీజన్‌లో 3 సెంచరీలు, 851 పరుగులు చేసిన గిల్ ను కట్టడి చేయడం చెన్నై ముందు అతిపెద్ద సవాలు. దీపక్ చాహర్ స్వింగ్ లేదా రవీంద్ర జడేజా బౌలింగ్ లో వికెట్ పడటం జరగాలి. ఇక ఆఫ్ స్టంప్ వెలుపల మోయిన్ అలీ వేసిన బంతి లేదా మతిషా పతిరనా బాల్ స్ట్రెయిట్ లెగ్ మీద పడటం ఇలా బౌలర్ల దాడి గిల్ ఏకాగ్రతను ఏది విచ్ఛిన్నం చేస్తుందో చూడాలి. మరోవైపు బ్యాట్స్‌మెన్ మ్యాచ్‌లను గెలిపిస్తారు, కానీ బౌలర్లు టోర్నమెంట్‌లను గెలుస్తారని టైటాన్స్ ఇప్పటికే నిరూపించింది. మొత్తానికి ఈ రోజు జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ ధోనీ ఫెయిర్వేల్ ట్రీట్ ను చెడగొట్టేలా కనిపిస్తున్నాడు.
Read More: IPL Final: కౌన్ బనేగా ఛాంపియన్.. టైటిల్ పోరుకు గుజరాత్, చెన్నై రెడీ..!