Shubman Gill: స్పైడర్ మ్యాన్ కి డబ్బింగ్ చెప్పిన శుభ్‌మన్ గిల్

భారత క్రికెట్‌లో వర్ధమాన ఆటగాడు శుభ్‌మన్ గిల్ తన అద్భుతమైన క్రికెట్‌తో ఎంతో మందిని అలరించాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ సీజన్లో శుభ్‌మన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా అవతరించాడు

Shubman Gill: భారత క్రికెట్‌లో వర్ధమాన ఆటగాడు శుభ్‌మన్ గిల్ తన అద్భుతమైన క్రికెట్‌తో ఎంతో మందిని అలరించాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ సీజన్లో శుభ్‌మన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా అవతరించాడు. ఈ సీజన్లో శుభ్‌మన్ మూడు సెంచరీలు బాది గుజరాత్ టైటాన్స్ ను ఫైనల్ కు తీసుకొచ్చాడు. ఇక శుభ్‌మన్ కి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ క్రికెటర్ ఓ సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పాడట.

స్పైడర్ మ్యాన్ హిందీ, పంజాబీ వెర్షన్‌లకు శుభ్‌మాన్ గిల్ డబ్బింగ్ అందించాడు.స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్ అనేది యానిమేషన్ చిత్రం. తాజాగా శుభ్‌మన్ గిల్ ఓ ఇంటర్వ్యూలో స్పైడర్ మ్యాన్ గురించి మాట్లాడాడు. 1రోజు స్పైడర్‌మ్యాన్‌గా అవకాశం వస్తే ఏం చేస్తానని అడగ్గా.. దీనిపై శుభమాన్ గిల్ ఆసక్తిగా సమాధానం ఇచ్చాడు. “ప్రపంచ కప్ ఫైనల్‌లో ఒక రోజు స్పైడర్ మ్యాన్‌గా ఉండటానికి నేను ఖచ్చితంగా ఇష్టపడతాను. ఆ అవకాశమే ఉంటె నేను సాలీడులా ఎగిరి బంతిని పట్టుకోగలను.” అంటూ శుభమాన్ చెప్పాడు. ఇక ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌కు చేరుకున్నాడు. ఇదిలా ఉండగా స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్ విడుదలైంది. 10 భాషల్లో 1800 స్క్రీన్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Read More: Supreme Court: రూ. 2 వేల నోటు మార్పిడి పై సుప్రీంకోర్టులో పిటిషన్.. కోర్టు ఏం చెప్పిందో తెలుసా?