Shubman Gill: ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్, పాక్, బంగ్లాదేశ్ మ్యాచులకూ డౌటే

డెంగ్యూ జ్వరం నుండి కోలుకున్న శుభ్‌మాన్ గిల్ చెన్నైలోని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.

  • Written By:
  • Publish Date - October 10, 2023 / 03:02 PM IST

Shubman Gill: డెంగ్యూ జ్వరం నుండి కోలుకున్న శుభ్‌మాన్ గిల్ చెన్నైలోని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే భారత ఓపెనర్ శనివారం అహ్మదాబాద్‌లో పాకిస్తాన్‌తో జరుగబోయే మ్యాచ్ కు అందుబాటులోకి వస్తాడా? రాడా అనేది మాత్రం సందేహంగానే ఉంది. ఇక ఆదివారం రాత్రి ప్లేట్‌లెట్ల సంఖ్య లక్షకు తగ్గడంతో గిల్‌ను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. గిల్‌ని సుప్రసిద్ధ మల్టీ-కేర్ స్పెషాలిటీ హాస్పిటల్ ‘కావేరి’లో చేర్చారని భారత జట్టు వైద్యుడు రిజ్వాన్ తెలిపాడు.

గత వారం చెన్నైకి వచ్చినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ బాధపడ్డాడు. దీంతో అక్టోబర్ 8 న ఆస్ట్రేలియాతో జరిగిన భారత జట్టు ప్రపంచ కప్ ఓపెనర్‌కు దూరమయ్యాడు. బుధవారం ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా గిల్ దూరం కానున్నాడు. కనీసం ఒక వారం పాటు విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ కు కూడా దూరం కానున్నాడు.

అంతేకాదు.. అక్టోబరు 19న పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో పాల్గొనకపోవచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్లేట్‌లెట్ కౌంట్ 70,000కి పడిపోవడంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత వైద్యుల సూచన మేరకు గిల్ డిశ్చార్జ్ అయ్యాడు.