Shubman Gill: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట (85 ఓవర్లు) ముగిసింది. భారత్ 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) (114*), రవీంద్ర జడేజా (41*) ఉన్నారు. అంతకుముందు యశస్వి జైస్వాల్ (87), కరుణ్ నాయర్ (31), రిషభ్ పంత్ (25), కేఎల్ రాహుల్ (2), నితీశ్ కుమార్‌రెడ్డి (1) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, బషీర్ ఒక్కో వికెట్ తీశారు.
గిల్ సూపర్ సెంచరీ
బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ శతకం సాధించాడు. ఈ ఘనతతో అతడు ఒక చారిత్రక రికార్డును సృష్టించాడు. కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత తన మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో శతకం సాధించిన నాల్గవ భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. ఇంతకుముందు ఇంగ్లాండ్‌తో లీడ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో గిల్ 147 పరుగులు చేశాడు. భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌లలో వరుసగా మూడు మ్యాచ్‌లలో శతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో కూడా అతడు చేరాడు.
Also Read: Karun Nair: విరాట్ కోహ్లీ రీప్లేస్ అన్నారు.. ఇలాగైతే కష్టమే కరుణ్ నాయర్?!
ఈ జాబితాలో విరాట్ కోహ్లీ ఇప్పటికీ అతడి కంటే ముందున్నాడు. కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత తన మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో శతకం సాధించిన నాల్గవ భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. అతడికి ముందు విజయ్ హజారే, సునీల్ గవాస్కర్ కెప్టెన్‌గా నియమితులైన తర్వాత తమ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో శతకాలు సాధించారు. అయితే, విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత తన మొదటి మూడు టెస్ట్ మ్యాచ్‌లలో వరుసగా శతకాలు సాధించాడు. ఒకవేళ గిల్ తన తదుపరి టెస్ట్‌లో కూడా శతకం సాధిస్తే, ఈ విషయంలో విరాట్‌తో సమానంగా నిలుస్తాడు.
Take a bow, Captain Shubman Gill 👏👏
📸📸 The Centurion from Day 1 in Edgbaston! 💯#TeamIndia | #ENGvIND | @ShubmanGill pic.twitter.com/uC7ZJdoSEK
— BCCI (@BCCI) July 2, 2025
35 ఏళ్లలో ఇలా చేసిన మొదటి భారతీయుడు
భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ చరిత్రలో శుభ్‌మన్ గిల్ వరుసగా మూడు భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌లలో శతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. భారత టెస్ట్ కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌పై వరుసగా రెండు శతకాలు సాధించిన మూడవ భారత కెప్టెన్‌గా అతడు నిలిచాడు. అతడికి ముందు విజయ్ హజారే 1951-52లో, మహమ్మద్ అజహరుద్దీన్ 1990లో ఇలా చేశారు. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ 35 సంవత్సరాల తర్వాత ఇలా చేసిన మూడవ భారత కెప్టెన్‌గా నిలిచాడు.