Gill Breaks Silence: మే 30న హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ (Gill Breaks Silence) నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్‌ను 20 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్-2కు టికెట్ సంపాదించింది. ఈ మ్యాచ్‌లో టాస్ తర్వాత హార్దిక్ పాండ్యా- శుభ్‌మన్ గిల్ ఒకరితో ఒకరు చేతులు కలపలేదు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో గొడవలు ఉన్నాయని చర్చలు ఊపందుకున్నాయి. అయితే ఈ విషయంపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ సోషల్ మీడియా ద్వారా ఓ క్లారిటీ ఇచ్చాడు.
Shubman Gill's Instagram story. pic.twitter.com/wEzRWTMb6S
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 31, 2025
శుభ్‌మన్ గిల్ మౌనం వీడాడు
టాస్ తర్వాత శుభ్‌మన్ గిల్- హార్దిక్ పాండ్యా ఒకరితో ఒకరు చేతులు కలపలేదు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ ఔట్ అయినప్పుడు హార్దిక్ పాండ్యా అతని వద్దకు వెళ్లి సంబరాలు చేసుకున్నాడు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏదో సరిగా లేదనిపించింది. ఇంటర్నెట్‌లో గిల్- పాండ్యా మధ్య విభేదాలు ఉన్నాయనే పుకార్లు షికారు చేశాయి. అయితే శుభ్‌మన్ గిల్ ఈరోజు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఒక స్టోరీ షేర్ చేశాడు. ఇందులో అతను హార్దిక్‌ను మెన్షన్ చేస్తూ.. “మా ఇద్దరి మధ్య ప్రేమ తప్ప మరేమీ లేదు. ఇంటర్నెట్ పుకార్లను నమ్మవద్దు” అని రాశాడు. గిల్ ఇంటర్నెట్‌లో స్టోరీ షేర్ చేయడం ద్వారా ఈ వార్తలు నిజం కాదని స్పష్టం చేశాడు.
Also Read: WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు అలర్ట్.. రేపట్నుంచి ఈ ఫోన్లలో బంద్!
రెండో టైటిల్‌ను కోల్పోయిన జీటీ
ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత జీటీ ఐపీఎల్ 2025 ప్రయాణం ముగిసింది. గుజరాత్ ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేసింది. అయినప్పటికీ జట్టు నిరాశకు గురైంది. ఐపీఎల్ 2022 టైటిల్‌ను సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్ రెండో టైటిల్‌ను గెలుచుకోలేకపోయింది. ముంబై మొదట బ్యాటింగ్ చేసి ఈ మ్యాచ్‌లో 228 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా జీటీ 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 ముంబై ఇండియన్స్- పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోతుంది. ముంబై ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరాలని చూస్తుంది. అదే సమయంలో పంజాబ్ కూడా తమ మొదటి టైటిల్‌ను సాధించడానికి ముంబైని ఏ విధంగానైనా ఓడించేందుకు కసరత్తులు చేస్తోంది.