Shubham Gill Record: శుబ్‌మన్‌ గిల్‌ రికార్డుల మోత

జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో భారత యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ రికార్డుల మోత మోగించాడు.

Published By: HashtagU Telugu Desk
Subhaman Gill)

Shubham Gill Imresizer

జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో భారత యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ రికార్డుల మోత మోగించాడు. పూర్తి ఫామ్ లోకి వచ్చిన గిల్ చివరి మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టాడు. 97 బంతుల్లో ఒక సిక్స‌ర్ , 15 ఫోర్లతో 130 పరుగులు చేసిన గిల్ రెండు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో జింబాబ్వేపై అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన భారత ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1998లో బులవాయో వేదికగా జింబాబ్వేతో జరిగిన వన్డేలో 127 పరుగులు సాధించి సచిన్‌ అజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో 130 పరుగులు సాధించిన గిల్‌.. సచిన్‌ 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే
జింబాబ్వేపై సెంచ‌రీ సాధించిన పిన్న వ‌య‌స్కుడిగా గిల్ రికార్డ్ సృష్టించాడు. గ‌తంలో ఈ రికార్డ్ రోహిత్ శ‌ర్మ పేరు మీద ఉంది. రోహిత్ 23 సంవ‌త్స‌రాల 28 రోజుల వ‌య‌సులో జింబాబ్వేపై సెంచ‌రీ చేశాడు. మూడో వ‌న్డేలో 22 సంవ‌త్స‌రాల 348 రోజుల్లో జింబాబ్వేపై సెంచ‌రీ చేసిన శుభ్‌మ‌న్‌గిల్ రోహిత్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ 289 పరుగులు చేయగా …చివరి వరకూ పోరాడిన జింబాబ్వే 13 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. భారత్ ఇన్నింగ్స్ గిల్ సెంచరీ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా శుభ్‌మ‌న్ మాత్రం నిలకడగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో శుభ్‌మ‌న్ కు ఇదే తొలి సెంచరీ.

  Last Updated: 22 Aug 2022, 10:42 PM IST