Site icon HashtagU Telugu

T20 World Cup: టి20 ప్రపంచకప్ కెప్టెన్ గా గిల్

T20 World Cup

T20 World Cup

 T20 World Cup: ఇండియన్ టీమ్ లో సీనియర్ క్రికెటర్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ప్రస్తుతం టెస్ట్, వన్డే ఫార్మేట్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ లో మొన్నటిదాకా ముంబై ఇండియన్స్ నడిపించాడు. రోహిత్ నాయాకత్వంలో ముంబై ఐదు సార్లు ట్రోఫీ నెగ్గింది. ఈ ఏడాది ఐపీఎల్ వేలానికి ముందు అనూహ్యంగా రోహిత్ ను తప్పించి హార్దిక్ కు జట్టు పగ్గాలు అప్పగించారు. దీంతో రోహిత్ ప్రస్తుతం టీమిండియాకు టెస్ట్ మరియు వన్డే క్రికెట్ కు మాత్రమే సారధిగా వ్యవహరిస్తున్నాడు.

గత కొన్ని రోజులుగా వన్డే ఫార్మేట్ కు కూడా రోహిత్ ను తప్పించి యువరక్తానికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని బీసీసీఐ భావించింది. అయితే టీమిండియాను నడిపించే ఆ స్థాయి ఎవరికీ లేకపోవడంతో రోహిత్ నే కొనసాగించాలనుకుంది.ఇదిలా ఉంటే పరిమిత ఓవర్ల క్రికెట్ కు సారథిగా వ్యవహరిస్తున్న హార్దిక్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో పగ్గాలు చేపట్టిన సూర్య కుమార్ యాదవ్ కూడా గాయం బారీన పడ్డాడు. దీంతో ఇప్పుడు టి20 ఫార్మేట్ కు కెప్టెన్ సమస్య ఏర్పడింది. పైగా టీమిండియా ఆఫ్ఘానిస్తాన్ తో టి2ఓ సిరీస్ కు సిద్దమవుతుంది. ఆఫ్గానిస్తాన్ తో జరగనున్న టీ20 సిరీస్, జూన్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో జట్టు కెప్టెన్ గా ఎవరిని నియమించాలన్న విషయంపై బీసీసీఐ సెలెక్టర్లు మరియు నిపుణులతో భేటీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో టి20 సిరీస్ లకు రోహిత్ పేరు ప్రధానంగా తెరపైకి వచ్చినప్పటికీ అనూహ్యంగా శుభ్ మన్ గిల్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ గిల్ జట్టు బాధ్యతను తీసుకోకపోతే రవీంద్ర జడేజాను కెప్టెన్ చేసే అవకాశం కనిపిస్తుంది.నిజానికి వన్డేకు కూడా హిట్ మ్యాన్ కెప్టెన్సీ తాత్కాలికమైనది. ఎందుకంటే రోహిత్ కెరియర్ క్లైమాక్స్ లో ఉంది. మరో కెప్టెన్ ను ఇప్పుడు సెలెక్టర్లు చూసుకోవాల్సిందే. దీంతో గిల్ ట్రైన్ చేయాలనీ బీసీసీఐ భావిస్తుంది. సీనియర్లు రోహిత్, కోహ్లీ జట్టులో ఉన్నప్పుడే గిల్ ను ట్రైన్ చేయాలనుకుంటుంది. ఈ క్రమంలో సీనియర్లు ఇచ్చే ఇన్ పుట్స్ తీసుకుంటూ గిల్ జట్టును ముందుకు నడిపించగలడని భావిస్తున్నారు.

Also Read: MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు రెండు ఓట్లేసే అవకాశం

Exit mobile version