Shubman Gill: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరెంజ్ క్యాప్ విజేతగా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభమన్ గిల్ (Shubman Gill) నిలవనున్నాడు. ఐపీఎల్ 2023 ఆరెంజ్ క్యాప్ పట్టికలో ఫాఫ్ డు ప్లెసిస్‌ను అధిగమించేందుకు గిల్ (Shubman Gill)కు కేవలం 9 పరుగులు మాత్రమే అవసరం. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ (MI)తో జరిగే మ్యాచ్‌లో గిల్ ఈ ఫీట్‌ను సాధించే అవకావం ఉంది.
అయితే బాలీవుడ్ స్టార్ సారా అలీ ఖాన్‌ను గిల్ సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడు. దుబాయ్‌లో రొమాంటిక్ డిన్నర్‌లో సారా అలీ ఖాన్‌తో కలిసి శుభమన్ గిల్ కనిపించాడు. ఆ తర్వాత వీరి డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాకుండా విమానంలోనూ ఇద్దరూ కలిసి ప్రయాణించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు బయటకు వచ్చింది. సారా అలీ ఖాన్, శుభమన్ గిల్ ఇద్దరూ వేర్వేరు ఇంటర్వ్యూలలో తమ సంబంధాన్ని గురించి కూడా సూచించారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది.
చాలాసార్లు మీడియా ఈ విషయంపై వారిని ప్రశ్నించగా డేటింగ్ చేస్తున్నామనే ఇన్ డైరెక్ట్ గా చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా వీరిద్దరూ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడం అభిమానులను షాక్ కి గురి చేసింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏమైనా వచ్చాయా.. ఎందుకు విడిపోయారంటూ అభిమానులు నెట్టింట చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే గిల్ కి సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. శుభమన్ గిల్ గతంలో సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో ప్రేమలో ఉన్నాడు. సారా అలీ ఖాన్ కోసం గిల్ ఆమెను విడిచిపెట్టాడని పలు నివేదికలు సూచించాయి. అయితే అతను సారా టెండూల్కర్, సారా అలీ ఖాన్ ఇద్దరికి మంచి స్నేహితుడు అని కొందరు ఇప్పటికీ నమ్ముతున్నారు.