2ND ODI : రఫ్ఫాడించిన ఇషాన్…సెంచరీతో అదరగొట్టిన అయ్యర్…టీమిండియా ఘన విజయం..!!

ఫస్ట్ వన్డేలో 9 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా...సెకండ్ వన్డేలో ఘన విజయం అందుకుంది. రాంఛీలో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికను ఓడించింది భారత జట్టు.

  • Written By:
  • Publish Date - October 9, 2022 / 09:53 PM IST

ఫస్ట్ వన్డేలో 9 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా…సెకండ్ వన్డేలో ఘన విజయం అందుకుంది. రాంఛీలో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికను ఓడించింది భారత జట్టు. 1-1తేడాతో సిరీస్ ను సమం చేసింది. ఫస్ట్ వన్డేలో జిడ్డి బ్యాటింగ్ తో అభిమానుల సహనానికి పరీక్ష పెట్టిన ఇషాన్ కిషన్…రాంఛీలో చెలరేగిపోయాడు. 93 పరుగులు ఇసి…7 పరుగులతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఆ మార్క్ ను దాటేసి వన్డేలో సెకండ్ సెంచరీని నమోదు చేశాడు.

20 బంతుల్లో ఒక సిక్సర్ 13 పరుగులు చేసిన శిఖర్ ధావన్ నిరాశపరిచాడు. శుబ్ మన్ గిల్ 26 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. 279 పరుగుల లక్ష్య ఛేదనలో 48 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో ఇషాన్ కిసన్, శ్రేయాస్ అయ్యార్ కలిసి మూడో వికెట్ కు 161 పరుగుల భాగస్వామ్యం చేశారు. సౌతాఫ్రికాపై వన్డేలో మూడో వికెట్ కు ఇదే రెండో బెస్ట్. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, అజింకా రహానే 189 పరుగులు చేసి టాప్ లో ఉన్నారు. 84 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, జోర్న్ ఫోరిన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు… వన్డేల్లో సౌతాఫ్రికాపై అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్‌గా యూసఫ్ పఠాన్ (8 సిక్సర్లు) తర్వాత ప్లేస్‌లో ఇషాన్ కిషన్ నిలిచాడు.

103 బంతుల్లో 14 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్‌తో కలిసి నాలుగో వికెట్‌కి హాఫ్ సెంచరీ చేశారు. శ్రేయాస్ అయ్యర్ 111 బంతుల్లో 15 ఫోర్లతో 113 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సంజూ శాంసన్ 36 బంతుల్లో ఓ సిక్సర్, ఓ ఫోర్‌తో 30 పరుగులు చేసి మ్యాచ్‌ను కంప్లీట్ చేశాడు

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయింది. 278 పరుగులు చేసింది. 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన మహ్మద్ సిరాజ్, టీమిండియాకి తొలి బ్రేక్ ఇచ్చాడు. 31 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసిన జానెమ్నన్ మలాన్, తొలి వన్డే మ్యాచ్ ఆడుతున్న షాబజ్ అహ్మద్ బౌలింగ్‌లో LBW అవుట్ అయ్యాడు. 40 పరుగులకే 2 వికెట్లు సౌతాఫ్రికా కోల్పోయింది.