Site icon HashtagU Telugu

Shreyas Iyer: రోహిత్ త‌ర్వాత టీమిండియా టీ20 కెప్టెన్‌గా అయ్య‌ర్‌..?

Shreyas Iyer

Shreyas Iyer

Shreyas Iyer: టీ-20 ప్రపంచకప్‌లో టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అంతకుముందు టీ20 సిరీస్‌ నుంచి రోహిత్‌కు విశ్రాంతినిచ్చారు. ఇందులో ఐర్లాండ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా కనిపించాడు. టీ-20లో హార్దిక్ టీమ్ ఇండియా తదుపరి కెప్టెన్‌గా ఉంటాడని క‌థ‌నాలు వ‌చ్చాయి. అదే సమయంలో శుభ్‌మన్ గిల్‌ను కాబోయే కెప్టెన్ అని వార్త‌లు గుప్పించారు. T-20 ప్రపంచ కప్‌లో హార్దిక్‌ను భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా నియమించారు. అయితే అతని ప్రదర్శన, వ్యక్తిగత జీవితం గురించి వార్త‌లు వ‌స్తున్నాయి. హార్దిక్ తదుపరి కెప్టెన్‌గా ఉంటారా లేదా మరేదైనా ఎంపిక ఉంటుందా అనేది ఇప్పుడు అంద‌రీ మ‌దిలో ఉన్న ప్ర‌శ్న‌. రోహిత్ శర్మ తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ ఎవరన్న దానిపై అనేక ఊహాగానాలు వ‌స్తున్నాయి. వీటిపై టీమిండియా మాజీ ఆట‌గాడు రాబిన్ ఉతప్ప తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

రాబిన్ ఉతప్ప.. శ్రేయాస్ అయ్యర్‌కు మద్దతుగా నిలిచాడు

భారత మాజీ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప భారత తదుపరి కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ (Shreyas Iyer)కు మద్దతు ఇచ్చాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కి శ్రేయాస్ ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. రెండు జట్లను ఐపీఎల్ ఫైనల్స్‌కు తీసుకెళ్లిన తొలి కెప్టెన్ కూడా అతనే. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు శ్రేయాస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన విష‌యం తెలిసిందే.

Also Read: Ministers Quarters: మినిస్టర్స్ క్వార్టర్స్‌లో చోరీ.. నిర్మాణ సామగ్రి మాయం

కాబోయే కెప్టెన్ అయ్య‌ర్‌..?

జియోసినిమాతో ఉతప్ప మాట్లాడుతూ.. “అయ్య‌ర్ భారత కెప్టెన్ కాబోతున్నాడు. శ్రేయ‌స్‌.. శుభ్‌మన్ గిల్ కంటే ముందు వరుసలో ఉన్నాడని నేను భావిస్తున్నాను. అయ్యర్‌లో జట్టును హ్యాండిల్ చేసే అన్ని లక్షణాలు ఉన్నాయి. అతనికి ఆ పాత్ర ఉంది. చాలా నేర్చుకున్నాడు. గౌతమ్ గంభీర్, చంద్రకాంత్ పండిట్, అభిషేక్ నాయర్‌లతో శ్రేయస్ పనిచేస్తున్నాడని ఉతప్ప చెప్పాడు. ముగ్గురూ చాలా బలమైన వ్యక్తిత్వాలు” ఉన్న‌వారిని ఉతప్ప ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చాడు.

తదుపరి కెప్టెన్ కావడానికి సరైన ఎంపిక

శ్రేయాస్ అయ్యర్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడని ఉతప్ప అభిప్రాయపడ్డాడు. సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఐపీఎల్ సీజన్ అంతా ముందుకు వెళ్లడం నేర్చుకున్నాడు. ఆధిపత్యంతోనే ఇదంతా చేశాడు. అందుకే భారత తదుపరి కెప్టెన్‌గా అతనే సరైన వ్యక్తి అవుతాడని ఉతప్ప త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు.

We’re now on WhatsApp : Click to Join

అయ్యర్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా అతడిని తప్పించారు. దీంతో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌, రంజీ ట్రోఫీ సెమీస్‌ కూడా ఆడలేకపోయాడు. అప్పటికీ ఎన్ని విమర్శలు వచ్చినా కెప్టెన్‌గా సంయమనం పాటించాడు. ఉతప్ప.. అయ్యర్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. పెద్దగా సందడి చేయలేదన్నారు. అతను తన జట్టు కోసం ఏమి చేయాలో అది చేశాడ‌ని స్పష్టంగా చెప్పాడు.