Site icon HashtagU Telugu

Shreyas Iyer: WTC ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. శ్రేయాస్ అయ్యర్‌ దూరం.. కారణమిదే..?

Shreyas Iyer

Shreyas Iyer

జూన్ 2023లో ఇంగ్లాండ్‌తో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌ (Shreyas Iyer)దూరమయ్యాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న అతడు ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం కానున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. గాయం తీవ్రత కారణంగా ప్రస్తుతం ఐపీఎల్ 2023 నుంచి కూడా వైదొలిగాడు.

భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ గురించి ఓ పెద్ద వార్త వచ్చింది. అయ్యర్ తిరిగి శస్త్రచికిత్స చేయించుకోవలసి ఉంది. ఈ కారణంగా అతను IPL 2023, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుండి తప్పుకున్నాడు. WTC ఫైనల్ జూన్‌లో ఇంగ్లాండ్‌లోని ఓవల్‌లో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ESPNcricinfo ప్రకారం.. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ శస్త్రచికిత్స కోసం విదేశాలకు వెళ్లవలసి ఉంటుంది. శిక్షణను తిరిగి ప్రారంభించే ముందు కనీసం మూడు నెలల పాటు క్రికెట్ ఆటకు దూరంగా ఉంటాడు. వెన్ను గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే.

Also Read: Virat Kohli: కింగ్ అని పిలిస్తే నాకు నచ్చదు.. విరాట్ అని పిలిస్తేనే నాకు ఇష్టం: కోహ్లీ

ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో పాల్గొనలేకపోయాడు. గత కొంత కాలంగా శ్రేయాస్ అయ్యర్ ఈ గాయంతో బాధపడుతున్నాడు. బంగ్లాదేశ్‌లో భారత పర్యటన తర్వాత అతను న్యూజిలాండ్‌తో సిరీస్‌లో పాల్గొనలేకపోయాడు. రెండు సందర్భాల్లోనూ అతని నడుము వాపు కనిపించడం గమనార్హం. మిడిలార్డర్‌లో తన ఆటతీరుతో ఆకట్టుకుని స్థిరత్వాన్ని అందించిన శ్రేయాస్ అయ్యర్‌ను దూరం కావడం భారత శిబిరానికి నిరాశను మిగిల్చింది.

శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీతో కోల్‌కతా నైట్ రైడర్స్ తాత్కాలిక కెప్టెన్‌గా నితీష్ రాణాను నియమించింది. రెండు రోజుల్లో కేకేఆర్‌కి ఇది రెండో బ్యాడ్ న్యూస్. తాజాగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా ఐపీఎల్ 2023 నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. వ్యక్తిగత కారణాలు, జాతీయ కట్టుబాట్లను దృష్టిలో ఉంచుకుని షకీబ్ అల్ హసన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2023 నుంచి వైదొలగాలన్న తన నిర్ణయం గురించి బంగ్లాదేశ్ కెప్టెన్ KKR అధికారులకు కూడా తెలియజేశాడు. ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమితో ప్రారంభించింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో మొహాలీలో పంజాబ్ కింగ్స్ చేతిలో కేకేఆర్ ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు KKR తదుపరి మ్యాచ్ గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతుంది. సొంతగడ్డపై కేకేఆర్‌ గెలుపు ఖాతా తెరిచేందుకు ప్రయత్నిస్తుంది.