శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి ఎదురుదెబ్బ !

Shreyas Iyer  టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. గాయం నుంచి అయ్యర్ కోలుకున్నా.. బీసీసీఐ నుంచి రిటర్న్ టు ప్లే క్లియరెన్స్ లభించలేదు. దాని కోసం మరో రెండు మ్యాచ్ సిములేషన్ పరీక్షలను శ్రేయాస్ అయ్యర్ క్లియర్ చేయాల్సి ఉంది. ఈ టెస్టుల తర్వాత బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వైద్యుల బృందం ఆమోదిస్తేనే.. అయ్యర్ న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే అతడి స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్‌ను […]

Published By: HashtagU Telugu Desk
Shreyas Iyer

Shreyas Iyer

Shreyas Iyer  టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. గాయం నుంచి అయ్యర్ కోలుకున్నా.. బీసీసీఐ నుంచి రిటర్న్ టు ప్లే క్లియరెన్స్ లభించలేదు. దాని కోసం మరో రెండు మ్యాచ్ సిములేషన్ పరీక్షలను శ్రేయాస్ అయ్యర్ క్లియర్ చేయాల్సి ఉంది. ఈ టెస్టుల తర్వాత బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వైద్యుల బృందం ఆమోదిస్తేనే.. అయ్యర్ న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే అతడి స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్‌ను జట్టులోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.

  • శ్రేయాశ్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై సందిగ్ధత
  • క్లియల్ చేయాల్సిన మరో రెండు టెస్టులు
  • వైద్యులు ఆమోదిస్తేనే వన్డే జట్టుకు ఎంపిక

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన విషయం తెలిసిందే. అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌లో డిసెంబర్ 25న చేరాడు. అయితే డిసెంబర్ 30 నాటికి అతడు ఫిట్‌నెస్ సాధించి బయటకు వస్తాడనుకుంటే.. అది జరగలేదు. బీసీసీఐ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించలేదు. దీంతో 50 ఓవర్ల మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేసేంత బలం ఇంకా రాలేదని.. న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు విజయ్ హజారే ట్రోఫీతో ఆడే అవకాశం లేదని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. తన ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు శ్రేయాశ్ అయ్యర్ ఇంకా రెండు మ్యాచ్- సిములేషన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

బీసీసీఐ వన్డే జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో.. టీమ్‌లోకి రావడానికి శ్రేయాస్ అయ్యర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అతడికి ఇంకా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నుంచి క్లియరెన్స్ రాలేదు. అది రావాలంటే అతడు జనవరి 2, 5 తేదీల్లో జరిగే రెండు మ్యాచ్ సిములేషన్స్ సెషన్స్ క్లియర్ చేయాలి. ఇప్పటికే బ్యాటింగ్, బౌలింగ్‌కు సంబంధించి నాలుగు హై-ఇంటెన్సిటీ టెస్టులను శ్రేయాస్ అయ్యర్ విజయవంతంగా పూర్తి చేశాడు. మరో రెండు టెస్టుల్లో అతడి శరీరం ఎలా స్పందిస్తుందో పరిశీలించి.. న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక చేయొచ్చో లేదో.. సెంటర్ ఆప్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్న వైద్యులు బృందం నిర్ణయిస్తుంది. కాగా, జనవరి 3న బీసీసీఐ న్యూజిలాండ్ సిరీస్ జట్టును ఎంపిక చేయనుంది. మరి.. మరో మ్యాచ్- సిములేషన్ మిగిలి ఉండగానే.. శ్రేయాస్ అయ్యర్‌ను సెలెక్ట్ చేస్తారో లేదో వేచి చూడాలి.

కాగా, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ప్లేయర్లందరూ కచ్చితంగా డొమెస్టిక్ సిరీస్‌లు ఆడాలని బోర్డు కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీ 2025- 26లో ఆడారు. అయితే శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ దేశవాళీ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కానీ గాయం కారణంగా ఆడలేకపోయాడు.

న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు టీమిండియా (అంచనా) జట్టు..

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (ఒకవేళ శ్రేయాస్ సెలెక్ట్ కాకపోతే దేవదత్ పడిక్కల్‌), విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్‌ కృష్ణ, హర్షిత్ రాణా

  Last Updated: 02 Jan 2026, 05:36 PM IST